స్మార్ట్ ఫోన్ స్విచ్చాఫ్ చేయొద్దు!

13 May, 2015 15:51 IST|Sakshi
స్మార్ట్ ఫోన్ స్విచ్చాఫ్ చేయొద్దు!

న్యూయార్క్: బ్యాటరీ బాగా మన్నుతుందన్న ఉద్దేశంతో చాలా మంది తమ స్మార్ట్ ఫోన్ ను పడుకునే ముందు స్విచ్ఛాఫ్ చేస్తారు. అయితే దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదంటున్నారు సాంకేతిక నిపుణుడు, ఐఫిక్సిట్ వ్యవస్థాపకుడు కైలి వీన్స్. స్మార్ట్ ఫోన్ ను స్విచ్ఛాఫ్ చేసినంత మాత్రానా బ్యాటరీ జీవితకాలం పెరగదని చెప్పారు.

ఫోన్ వాడుతూవుంటనే బ్యాటరీ బాగా మన్నుతుందని వెల్లడించారు. ఫోన్ చార్జింగ్ సగానికి తగ్గినప్పుడే ఛార్జింగ్ పెడితే బ్యాటరీ జీవిత కాలం పెరుగుతుందని వివరించారు. మ్యూజిక్ వినడం, జీపీఎస్ వాడడం, వీడియోలు వీక్షించడం వల్ల బ్యాటరీ పాడైపోదని చెప్పారు. స్విచ్చాఫ్ చేసి, ఆన్ చేయడం వల్లే బ్యాటరీ జీవితకాలం తగ్గుతుందని వివరించారు.

మరిన్ని వార్తలు