ఆలయాలపై దాడుల గురించి మాట్లాడరేం?

24 Apr, 2015 19:21 IST|Sakshi
ఆలయాలపై దాడుల గురించి మాట్లాడరేం?

న్యూఢిల్లీ: అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలను పరిరక్షించాల్సిన అవసరముందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ప్రార్థనా మందిరాలపై ఎలాంటి దాడులు జరగడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వేలాది సంవత్సరాలుగా భారత దేశంలో మత సామరస్యం పరిఢవిల్లుతోందని, ఇది ఇలాగే కొనసాగాలని జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ వ్యాఖ్యానించారు.

క్రైస్తవుల మత ప్రయోజనాలు కాపాడాలంటూ దాఖలైన 'పిల్'పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని చర్చిలపై దాడులు జరిగిన నేపథ్యంలో ఈ పిల్ దాఖలు చేశారు. మత సంబంధమైన ప్రయోజనాల కోసమే ఈ వ్యాజ్యం వేశారని, మతంతో సంబంధం లేకుండా అన్ని ప్రార్థనా మందిరాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అనిల్ సోని వాదించారు.

ఆలయాలు, గురుద్వారాలు, మసీదులపై కూడా దాడులు జరిగాయని... వాటి గురించి ఎవరూ మాట్లాడడం లేదని వాపోయారు. పిటిషనర్ అన్ని మతాల గురించి ఆలోచించాలని సూచించారు. ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది. అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలను సమానంగా కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది.

మరిన్ని వార్తలు