అక్కడ సన్నీ లియోన్ ఐటం నంబర్ కట్

17 Jul, 2016 21:11 IST|Sakshi

ఓ ముస్లిం వ్యాపారవేత్త జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల సమాహారంగా రూపొందుతోన్న ‘రాయిస్’ చిత్రంపై దాయాది దేశంలో అప్పుడే ఆంక్షలు మొదలయ్యాయి. షారూఖ్ ఖాన్ హీరోగా, పాకిస్థానీ నటి మహీరా ఖాన్ హీరోయిన్ నటిస్తోన్న ‘రాయిస్’ను పాకిస్థాన్ లోనూ అధికారికంగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఆ సినిమా పాటల ఆల్బమ్ లో నాటి బాలీవుడ్ హిట్ సాంగ్ ‘లైలా ఓ లైలా..’ రిమిక్స్ వెర్షన్ కూడా ఉంది. షారూఖ్, సన్నీ లియోన్ లపై చిత్రీకరించిన ఆ ఐటం పాటలో ‘మసాలా’ కాస్త ఘాటుగానే ఉంటుందట. అయితే పాక్ లో విడుదలయ్యే ‘రాయిస్’లో  ఆ ఒక్క పాటను మాత్రం కట్ చేయబోతున్నట్లు సమాచారం. (అప్పుడు చాలా భయమేసింది: సన్నీ లియోన్)  

పాక్ లో పుట్టిపెరిగి, బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తోన్న మహీరా ఖాన్ కు స్వదేశంలో ఉన్న ఆదరణతో వసూళ్లు రాబట్టవచ్చని ‘రాయిస్’ రూపకర్తల అభిప్రాయం. అయితే సన్నీ ఐటం నబంర్ పై మాత్రం పాకిస్థానీలు ఆగ్రహం వెలిబుచ్చే అవకాశం ఉందని, అందుకే ఆ పాటను తొలిగించి విడుదల చేయబోతున్నారని వార్తా సంస్థ‘ఏసియన్ ఏజ్’ పేర్కొంది. గౌరీఖాన్, రితేశ్ సిద్వానీ, ఫరాఖాన్ ల సంయుక్త నిర్మాణంలో రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహించిన ‘రాయిస్’ 2017 జనవరి 26న విడుదలకానుంది. (నావి బెడ్ రూమ్ కళ్లు, అసలు అలసిపోవు: షారూఖ్)

మరిన్ని వార్తలు