ఫిబ్రవరికల్లా లౌకిక కూటమి: ప్రకాశ్ కారత్

12 Jan, 2014 02:52 IST|Sakshi
ఫిబ్రవరికల్లా లౌకిక కూటమి: ప్రకాశ్ కారత్

పకాశ్ కారత్ ఉద్ఘాటన
 కొచ్చి: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని సమర్థంగా ఎదుర్కొనే దిశగా కాంగ్రెసేతర లౌకిక పార్టీల కూటమి ఏర్పాటు ఈ ఫిబ్రవరికల్లా సాకారమయ్యే అవకాశాలున్నాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అన్నారు. ‘‘బీజేపీని, మోడీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు విఫలమవుతున్నాయి. కాంగ్రెసేతర లౌకిక పార్టీల కూటమి మాత్రమే బీజేపీ, మోడీలకు సరిగ్గా చెక్ పెట్టగలదు’’ అని శనివారం ఎర్నాకుళంలో అన్నారు. వివిధ కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలను ఒక తాటిపైకి తెచ్చేందుకు సీపీఎం, వామపక్షాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయన్నారు. ‘ఈ సారి ఎన్నికలకు ముందే 14 ప్రాంతీయ పార్టీలు ఒక్కటయ్యాయి. ఫిబ్రవరి తొలి వారాల్లో కూటమి ఒక రూపు వస్తుంది’ అని చెప్పారు. సీపీఎం నేతలు, కార్యకర్తలు.. బ్లాగ్‌లు, సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లలో తమ అభిప్రాయాలను వ్యక్తంచేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అవి పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు