ఆ పరీక్షలో నార్త్ కొరియా ఫెయిల్

23 Mar, 2017 08:17 IST|Sakshi
ఆ పరీక్షలో నార్త్ కొరియా ఫెయిల్
సియోల్, దక్షిణకొరియా :  అమెరికా, దక్షిణ కొరియాలకు దడపుట్టిస్తూ నార్త్ కొరియా లాంచ్ చేసిన క్షిపణి పరీక్ష ఫెయిల్ అయింది. నార్త్ కొరియా పరీక్షించిన కొత్త క్షిపణి లాంచ్ చేసిన సెకన్ల వ్యవధుల్లోనే ఫెయిల్ అయినట్టు దక్షిణ కొరియా రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి 22 బుధవారం ఉదయం వాన్ సాన్ ఎయిర్బేస్ నుంచి నార్త్ కొరియా ఓ క్షిపణి లాంచ్ చేసింది, కానీ అది విఫలమైనట్టు దక్షిణ కొరియా, అమెరికాలు తెలుసుకోవాల్సి ఉందని సియోల్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే ఇది ఏ రకమైన క్షిపణో పరిశీలిస్తున్నామని అధికారి చెప్పారు. నార్త్ కొరియా లాంచ్ చేసే అదనపు క్షిపణి పరీక్షలకు దక్షిణ కొరియా సన్నద్ధమై ఉందని పేర్కొన్నారు.
 
బుధవారం ఉదయం నార్త్ కొరియా నగరం వాన్ సాన్ నుంచి వివిధ రకాల క్షిపణులను నార్త్ కొరియా లాంచ్ చేసినట్టు జపనీస్ క్యోడో వార్తా సంస్థ అంచనావేస్తోంది. ప్రీక్వెన్సీని పెంచుతూ నార్త్ కొరియా క్షిపణి పరీక్షలను నిర్వహిస్తూ వస్తోంది. క్షిపణి టెక్నాలజీలో తాము ముందున్నామనే విషయాన్ని నార్త్ కొరియా ఈ పరీక్షల ద్వారా అమెరికాకు చాటిచెబుతోంది. జపాన్ లో నీటిలోకి 1000 కిలోమీటర్ల మేర చొచ్చుకుని వెళ్లే విధంగా నాలుగు క్షిపణులను నార్త్ కొరియా ఈ నెల మొదట్లో పరీక్షించిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ కొరియా ఎలాంటి క్షిపణి పరీక్షలు నిర్వహించకుండా అమెరికా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను ఉల్లంఘించి నార్త్ కొరియా ఇటీవల పలుసార్లు క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ అమెరికా, జపాన్ లకు దడపుట్టిస్తోంది. 
 
 
మరిన్ని వార్తలు