కుక్కల 'వైన్' వచ్చేసింది!

9 Aug, 2016 14:10 IST|Sakshi

వాషింగ్టన్: జంతుప్రేమికులకు అమెరికాలోని వాషింగ్టన్ కు చెందిన ఓ కంపెనీ తీపి కబురు అందించింది. కుక్కల కోసం ప్రత్యేకమైన మద్యాన్ని అమ్మకానికి పెడుతున్నట్లు అపోలో పీక్ ప్రకటించింది. జిన్ ఫ్యాన్ టెయిల్, చార్ డాగ్ నాయ్ పేర్లతో రెండు రకాలను వినియోగానికి అందుబాటులోకి తెచ్చింది. 350 ఎంఎల్ రేంజ్ లో బాటిళ్లు లభ్యకానున్నట్లు చెప్పింది.

కుక్కులకు హనికలిగించే ద్రాక్ష, ఆల్కహాల్ కు సంబధించిన మిశ్రమాలేవి వీటి తయారీ ఉపయోగించలేదని పేర్కొంది. ఈ వైన్ తయారీ కోసం పెప్పర్ మింట్, చామోమైల్ లను ఉపయోగించినట్లు తెలిపింది. ఈ పదార్ధాలు కుక్కలను కంట్రోల్ చేసేందుకు ఉపకరిస్తాయని పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో పిల్లుల కోసం ప్రత్యేక వైన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

చామోమైల్ కలిగివున్న పదార్ధాలను తీసుకోవడం వల్ల పెంపుడు జంతువులు పాయిజనింగ్ కు గురయ్యే అవకాశం ఉందని ఓ అమెరికన్ పత్రిక ప్రచురించింది. దీనిపై స్పందించిన అపోలో పీక్ యాజమాన్యం అప్పుడప్పుడు మాత్రమే పెట్ కు వైన్ ఇవ్వడం వల్ల దాన్ని నిరోధించవచ్చని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు