సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఇక ఈసీలు, సీసీలు

4 Dec, 2013 02:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఇకపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్(ఈసీ)లు, సర్టిఫైడ్ కాపీలు(సీసీ-దస్తావేజు నకళ్లు) ఇవ్వాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి తోట నరసింహం ఆదేశించారు. ప్రస్తుతం ఈసీలు, సీసీలు కేవలం మీసేవా కేంద్రాల్లోనే ఇస్తున్నారు. అయితే మీసేవా కేంద్రాల్లో కొన్ని సాంకేతిక ఇబ్బందులతోపాటు, 1990కి ముందు రిజిస్ట్రేషన్ అయిన భూములకు సంబంధించిన నకళ్ల జారీలో కొన్ని తప్పులు దొర్లుతున్నాయి.

 

దీంతో ఆయా దరఖాస్తుదారులు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళుతున్నారు. అయితే దరఖాస్తుదారులు వస్తున్నా సబ్‌రిజిస్ట్రార్‌లు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సబ్‌రిజిస్ట్రార్‌ల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు విజయభాస్కర్, స్థితప్రజ్ఞలు మంగళవారం మంత్రి తోట నరసింహంను కలిసి.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసీలు, సీసీలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు