-

హ్యాకర్లకు మైక‍్రోసాఫ్ట్‌ సవాల్‌!

7 Mar, 2017 14:14 IST|Sakshi
హ్యాకర్లకు మైక‍్రోసాఫ్ట్‌ సవాల్‌!

న్యూయార్క్‌:   ప్రముఖ టెక్‌  దిగ్గజం మైక్రో సాఫ్ట్‌ బగ్‌బౌంటీలకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తోంది.  పరిమిత కాలానికిగాను బగ్ బౌంటీ ఆపరేషన్స్‌  వ్యయాన్ని దాదాపు రెట్టింపు చేసింది.  బగ్‌ పట్టు రూ.10 లక్షలు పట్టు  అంటూ  హ్యాకర్లకు ఓపెన్ చాలెంజ్ విసిరింది.  తమ సేవల్లో లోపాలు వుంటే పసిగట్టినవారికి నగదు బహుమతిని ఆఫర్‌ చేసింది.  ప్రపంచ వ్యాప్తంగా  తమ ఆన్‌లైన్‌ సేవల్లో తీవ్రమైన దాడులను, సెక్యురిటీ లోపాలను గుర్తించిన హ్యాకర్లకు మొత్తం దాదాపు 20లక్షలు(30వేల డాలర్లు) దాకా చెల్లించనుంది. వీటిలో కనీసం 500 డాలర్లుగాను, గరిష్టంగా 15 వేల డాలర్లు(రూ.10లక్షలు)  నజరానా చెల్లిస్తామని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది.  

ఇలా  సమర్పించినవాటిలో  అర్హులైన వారికి కనీసం 500 డాలర్లనుంచి 15 వేల డాలర్ల వరకు అందించనున్నట్టు  సోమవారం ఒక ప్రకటనలో ఎలిపింది.  అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 పోర్టల్, మైక్రోసాఫ్ట్ ఎక్స్ఛేంజ్ ఆన్లైన్ ​​కు సంబంధించి మార్చి 1 - మే 1 మధ్య కాలంలో సమర్పించిన  అర్హులైన    హ్యాకర్లు డబుల్ బొనాంజాకు అర్హులవుతారని తెలిపింది. ఇలా అందిన  అర్హమైన రిపోర్టులకు  సుమారు30 వేల డాలర్లదాకా అందించనున్నట్టు   మైక్రోసాఫ్ట్‌ కంపెనీ పేర్కొంది.  దీనిపై  మైక్రోసాఫ్ట్‌ నిర్ణయం తీసుకుంటుందని, దాడి ప్రభావం ఆధారంగా ఈ చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది.

క్రాస్‌ సైట్‌ స్ర్కిప్టింగ్‌; క్రాస్‌  సైట్‌ రిక్వెస్ట్‌ ఫోర్జరీ,  అనధికారిక క్రాస్‌ టెనంట్‌ డేటా టాంపరింగ్‌, యాక్సెస్  మల్టీ టెనంటింగ్‌ సర్వీసెస్‌  లాంటి ఇతర సర్వీసులలో వీటిని కనుగొనాల్సింది ఉంటుంది. అలాగే పోర్టల్‌.ఆఫీస్‌.కాం, ఔట్‌లుక్‌. ఆఫీస్‌365.కాం,  ఔట్‌లుక్‌. ఆఫీస్‌.కాం  లాంటి ఇతర నిర్దిష్ట డొమైన్లలో ఆయా దాడులను, ప్రభావాన్ని విశ్లేషించాలని మైక్రోసాఫ్ట్‌  హ్యాకర్లను  సవాల్‌ చేసింది.

కాగా   తమ కంపెనీ ఉత్పత్తులలో సెక్యురిటీ లోపాలను గుర్తించమని హ్యాకర్లకు సవాల్ చేసే కార్యక్రమే బగ్‌బౌంటీ   ఆపరేషన్స్‌. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లలో ‘సెక్యూరిటీ లోపాలు కనిపెడితే భారీ బహుమతిఅని హ్యాకర్లకు సవాల్ చేస్తుంటాయి. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు. ఇప్పటికే గూగుల్‌.. ఫేస్‌బుక్‌.. మైక్రోసాఫ్ట్‌ ట్విట్టర్‌ తదితర సంస్థలు ఈ కార్యక్రమాలను నిర్వహించడం తెలిసిందే.

 

మరిన్ని వార్తలు