ప్రియుడి కోసం అమెరికా నుంచి బెజవాడకు

24 Jun, 2016 02:18 IST|Sakshi
ప్రియుడి కోసం అమెరికా నుంచి బెజవాడకు

విజయవాడ:  ఓ ఎన్నారై యువతి విజయవాడలో ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే భర్తను కాదని మానస అనే యువతి ప్రియుడి కోసం విజయవాడకు వచ్చింది. తీరా ఆమె విజయవాడ వచ్చాక ప్రియుడు హేమంత్ రెడ్డి పత్తా లేకుండా పోయాడు.

అతడి కోసం ఫోన్ చేసిన ఫలితం లేకపోవడంతో మానస బంధువుల ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన బంధువులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా హేమంత్ కోసం ఫోన్ చేస్తే వాళ్ల కుటుంబసభ్యుడు కట్నం కోసం డిమాండ్ చేస్తున్నారని మానస ఆరోపించింది. మరోవైపు ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇంటికి వచ్చేందుకు అనుమతించడం లేదు.

వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన మానస చిన్ననాటి స్నేహితుడైన హేమంత్ రెడ్డి ప్రేమించుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఓ ఎన్నారైని గత డిసెంబర్లో పెళ్లి చేసుకుంది. మానస అమెరికాకు వెళ్లినప్పటి నుంచి హేమంత్ పెళ్లి చేసుకుంటానని ఫోన్లో చెప్పాడు. ప్రియుడితో కలిసి జీవించాలనుకున్న మానస విషయాన్ని భర్తకు చెప్పి...హేమంత్ కోసం అమెరికా నుంచి విజయవాడకు వచ్చింది. ఈలోగా...హేమంత్ రెడ్డి కనిపించకుండా పోవడంతో... తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లింది. వాళ్లు ఇంట్లోకి రావద్దని చెప్పడంతో బంధువుల ఇంట్లో చేరింది.

అక్కడ ఉంటూనే  ప్రియుడిని కలిసేందుకు ప్రయత్నించింది. ఎంతకీ ఫోన్ కలవకపోవడంతో..హేమంత్ ఇంటికి ఫోన్ చేసింది. వాళ్లు కట్నం డిమాండ్ చేయడంతో ..వేరే దారి లేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మానస పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భర్తను వదిలి వచ్చిన మానసను కట్నం పేరుతో మోసం చేయడం సరైన పద్దతి కాదంటున్నారు బంధువులు. ఎలాగైనా పోలీసులే మానసకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు