రెండింతల స్టోరేజ్తో నుబియా ఎన్1

6 Feb, 2017 21:54 IST|Sakshi
రెండింతల స్టోరేజ్తో నుబియా ఎన్1
ఆండ్రాయిడ్ లవర్స్కు గుడ్న్యూస్. ఇంటర్నల్ మెమరీని రెండింతలు చేసిన కొత్త నుబియా ఎన్1 భారత మార్కెట్లోకి లాంచ్ అయింది. 64జీబీ వేరియంట్తో లాంచ్ అయిన ఈ ఫోన్ను కంపెనీ ఫిబ్రవరి 8 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ఇండియా వెబ్సైట్లో విక్రయించనుంది.  బ్లాక్, గోల్డ్ కలర్ ఆప్షన్స్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. 5.5 అంగుళాల డిస్ప్లే ఈ ఫోన్ కలిగి ఉంది. వినియోగదారులను దృష్టిలో ఉంచుకున్న కంపెనీ ఈ ఫోన్లో 64జీబీ ఇంటర్నల్ మెమరీని అందించనున్నట్టు నుబియా ఇండియా దేశీయ మేనేజర్, ఎరిక్ హు తెలిపారు. ఈ ఫోన్ను మొదట గత డిసెంబర్లోనే కంపెనీ ఆవిష్కరించింది. ప్రస్తుతం ఇంటర్నల్ మెమరీ రెండింతలు చేసిన ఈ ఫోన్ ధర రూ.12,499. 
 
నుబియా ఎన్1 ఫీచర్లు...
ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6755 హిలియో పీ10 ప్రాసెసర్
32/64 జీబి అంతర్గత స్టోరేజ్ సామర్థ్యం
128 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ 
ఫింగర్ప్రింట్ స్కానర్, వాయిస్ ఎల్టీఈ ఓవర్ సపోర్టు
డ్యూయల్ సిమ్ 
13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 
నుబియా 4.0 యూఐతో ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్ 
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
 
మరిన్ని వార్తలు