యాహూ ఇక గతమే.. కొత్త పేరెంటో తెలుసా?

4 Apr, 2017 19:12 IST|Sakshi
యాహూ ఇక గతమే.. కొత్త పేరెంటో తెలుసా?

ఇంటర్నెట్‌ దిగ్గజంగా గతంలో ఓ వెలుగు వెలిగిన యాహూ కంపెనీ ఇక కాలగర్భంలో కలిసిపోనుంది. యాహూను సొంతం చేసుకున్న వెరిజాన్‌ కంపెనీ.. తన ఏవోఎల్‌ మెయిల్‌ను దానితో విలీనం చేసి.. ఓథ్‌ (ప్రమాణం) పేరిట కొత్త బ్రాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఇకమీదట ఓథ్‌ మెయిల్‌, ఓథ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు ఇంటర్నెట్‌ యూజర్లను పలుకరించనున్నాయి.

వెరిజాన్‌ కంపెనీ 4.8 బిలియన్‌ డాలర్ల మొత్తానికి యాహూ కంపెనీని కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏవోఎల్‌ మెయిల్‌లో యాహూ విలీనమైన తర్వాత ఈ రెండింటినీ కలిపి.. ఓథ్‌ అనే కొత్త కంపెనీ గొడుగు కిందకు తీసుకురానున్నట్టు ఏవోఎల్‌ సీఈవో టిమ్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. 'వందకోట్లకుపైగా వినియోగదారులు, 20కిపైగా బ్రాండ్లు, ఎదురులేని బృందం.. టేక్‌ ద ఓథ్‌ (ప్రమాణం చేయండి)' అంటూ ఆర్మ్‌స్ట్రాంగ్‌ ట్వీట్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు