12న ఒబామా చివరి ‘అధ్యక్ష’ ప్రసంగం

28 Dec, 2015 01:18 IST|Sakshi
12న ఒబామా చివరి ‘అధ్యక్ష’ ప్రసంగం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్టేట్ ఆఫ్ ద యూనియన్‌ను ఉద్దేశించి తన చివరి ప్రసంగం చేయనున్నారు. జనవరి 12న ఆయన అమెరికన్ కాంగ్రెస్ సంయుక్త భేటీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తన అధ్యక్ష కాలంలో సాధించిన విజయాలను వివరించనున్నారు. క్యూబాతో సంబంధాల పునరుద్ధరణ తదితర అంశాలను ప్రస్తావించే అవకాశముంది. ప్రస్తుతం హవాయి ద్వీపంలో సంవత్సరాంతపు సెలవుల్లో ఉన్న ఒబామా ఈ విషయాన్ని ఈమెయిల్‌లో తెలిపారు. తాను  పదవి చేపట్టే నాటికి.. ఇప్పటికీ నిరుద్యోగం  తగ్గిందన్నారు.  ఒబామా పదవీ కాలం మరో 12 నెలల్లో ముగియనుంది.

మరిన్ని వార్తలు