'టూవీలర్స్ కూ వర్తింపజేయండి'

29 Dec, 2015 11:36 IST|Sakshi
'టూవీలర్స్ కూ వర్తింపజేయండి'

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాలకు సరి-బేసి సంఖ్యల విధానం అమలు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు ఆదర్శ్ శాస్త్రి అభిప్రాయపడ్డారు. ప్రయాణికులకు సరిపడినన్ని బస్సులు ఉంటే టూవీలర్స్ ను సరి-బేసి పాలసీలో చేర్చవచ్చని చెప్పారు. దిచక్ర వాహనదారులకు ప్రత్యామ్నాయం చూపిస్తే ఈ పథకం విజయవంతం అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

సరి-బేసి సంఖ్య విధానం అమలుచేసిన వారం రోజుల్లో దీన్ని సమీక్షించి ద్విచక్ర వాహనాలకు వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పిన విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తుచేశారు. సరి-బేసి విధానం అమల్లోకి వచ్చిన వారం తర్వాత టూవీలర్స్ కు దీన్ని వర్తింపజేయడం సాధ్యమేనని శాస్త్రి పేర్కొన్నారు.

ఢిల్లీలో ఉన్న 85 లక్షల వాహనాల్లో 55 లక్షల వరకు ద్విచక్ర వాహనాలున్నాయి. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు జనవరి 1 నుంచి కార్లకు సరి-బేసి సంఖ్యల విధానం అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు