బస్సు ఛార్జీలు తగ్గించిన ప్రభుత్వం

5 Nov, 2014 14:49 IST|Sakshi

ప్రయాణికులకు ఓ శుభవార్త. బస్సు ఛార్జీలను మరింత తగ్గిస్తున్నట్టు ఒడిషా ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. గత కొన్నిరోజుల క్రితమే ఆయిల్ కంపెనీలు డిజీల్ రేట్లను తగ్గించడంతో బస్సు ఛార్జీలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రమేష్ మజోహి తెలిపారు. ఈ కొత్త ఛార్జీలు బుధవారం నుంచే అమలులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులకు కిలోమీటర్కు ఒక పైసా చొప్పున టికెట్ ధర తగ్గించినట్టు చెప్పారు. అధేవిధంగా డీలక్స్, ఏసీ డీలక్స్ బస్సులలో రెండు పైసల చొప్పున ధర తగ్గించినట్టు మజోహి తెలిపారు. గత నెల 31న డీజిల్ ధర రూ. 2.25 లకు పడిపోయింది. అదే నెలలో డీజిల్ ధర తగ్గడం ఇది రెండోసారి.

దాంతో ఒడిషా ప్రభుత్వం బస్సు ఛార్జీలు తగ్గించాలని నిర్ణయించింది. ఇక పై ప్రయాణికులు ఆర్డినరీ బస్సులలో ప్రయాణించాలంటే కిలోమీటర్కు 62 పైసలు చొప్పున చెల్లించాలి. ఎక్స్ప్రెస్ బస్సులకు ఒక  కిలోమీటరుకు 85 పైసలు చొప్పున ఛార్జ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ డీలక్స్ బస్సులలో 85 పైసలు చొప్పున ఛార్జ్ చేస్తే ఏసీ డీలక్స్ బస్సులలో ప్రయాణించాలంటే ప్రయాణికులు కిలోమీటర్కు రూ. 1.04 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు