పెట్రోలియం డీలర్స్‌కి ఝలకిచ్చిన మంత్రిత్వ శాఖ

20 Apr, 2017 19:46 IST|Sakshi
పెట్రోలియం డీలర్స్‌కి ఝలకిచ్చిన మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీ: త్వరలో ప్రతి ఆదివారం  పెట్రోల్‌ బంకులు మూసివేయాలన్న  నిర్ణయానికి ఆయిల్‌ మంత్రిత‍్వ శాఖ  నో చెప్పింది.  పెట్రోలియం డీలర్స్‌కి నిర్ణయానికి మంత్రిత్వ శాఖ రెడ్‌ సిగ్నల్‌ వేసింది.  ముఖ్యంగా   దక్షిణ భారతదేశంలో పెట్రోల్ పంపు ఆపరేటర్ల అసోసియేషన్‌   ఆదివారాలు  మూసివేయాలని నిర్ణయంపై మంత్రిత్వ శాఖ ప్రతికూలంగా స్పందించింది.  ఈ  చర్య సాధారణ ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తుందని వ్యాఖ్యానించింది.

పెట్రోలియమ్ మినహాయింపులు లేదా పెట్రోల్ ఔట్‌ లెట్ల మూసివేసేందుకు అంగీకరించడం లేదని మంత్రిత్వశాఖ వరుస ట్వీట్లలో పేర్కొంది. ఇది ప్రజల అసౌకర్యానికి దారి తీస్తుందని ట్వీట్‌ చేసింది.  అలాగే ఈ ట్వీట్లను రీ ట్వీట్‌ చేసిన చమురు శాఖ  మంత్రి  ధర్మాన్‌ ప్రధాన్‌ కూడా ఇదే  సందేశాన్నిచ్చారు.  మేజర్‌ డీలర్‌ అసోసియేషన్లు ఈ నిర్ణయంలో భాగస్వాములు కాదని  ట్వీట్‌ చేశారు.

మరోవైపు పబ్లిక్‌ సెక్టార్‌ ఆయిల్‌ సంస్థలకు  చెందిన 53,223 పెట్రోల్‌ పంపుల్లో  80 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న బంకుల యాజమాన్యాలు ఈ ప్రక్రియలో పాల్గొనడం లేదని ప్రకటించాయి. అయితే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటకలోని కొన్ని భాగాలు , బెంగళూకు, మహారాష్ట్ర, ముఖ్యంగా ముంబైలోని కొన్ని ప్రాంతాలు ఆదివారం పెట్రోల్‌ ఔట్‌ లెట్లను బంద్‌ను పాటించేందుకు అంగీకరించాయి.

కాగా ఎనిమిది రాష్ట్రాల్లో   మే 14వతేదీ నుంచి ప్రతి ఆదివారం తమ రిటైల్ అవుట్ లెట్లను  మూసివేసేందుకు నిర్ణయించినట్టు పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌, భారతీయ పెట్రోలియం డీలర్స్ కన్సార్టియం ఇటీవల ప్రకటించింది. ప్రధానమంత్రి  నరేంద్రమోదీ  "మన్ కి బాత్" కార్యక్రమం సందర్భంగా  ఇచ్చిన  సేవ్ ఆయిల్  పిలుపుకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నామని  వెల్లడించిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు