ఓలాలో భారీ పెట్టుబడులు

24 Oct, 2016 16:39 IST|Sakshi
ఓలాలో భారీ పెట్టుబడులు

న్యూఢిల్లీ: దేశీయ ఆన్లైన్ ట్యాక్సీ సేవల సంస్థ  ఓలా  తన సర్వీసులను మరింతగా విస్తరించేందుకు పావులు కదుపుతోంది.  ముఖ్యంగా ప్రధాన  ప్రత్యర్థి ఉబెర్  కు చెక్ చెప్పాలని  యోచిస్తోంది.  ఈ క్రమంలోనే భారీ పెట్టుబడులను సమీకరిస్తోంది.  తాజాగా జపాన్ బ్యాంక్ తో భారీ ఆఫర్  ఓలాకు  లభించనుంది.  జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ కార్పొరేషన్ రూ 2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది .క్యాబ్ ప్రపంచంలో ప్రత్యేకమైన పేరును సంపాదించిన  ఓలా దేశంలో మరింత విస్తరించేందుకు వీలుగా ఈ పెట్టుబడి పెట్టనున్నట్టు సమాచారం. ప్రధానంగా క్యాబ్ అగ్రిగేటర్, అమెరికాకు చెందిన ప్రత్యర్థి ఉబెర్ కు పోటీగా  ఈ పెట్టుబడులు పెట్టనుందని  మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఏఎన్ లై టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్ ఓలా జపనీస్ టెలికాం దిగ్గజం, ఇంటర్నెట్ మేజర్ ఇతర  పెట్టుబడిదారుల నుంచి మరో 250 నుంచి 300 మిలియన్ డాలర్లనుపెట్టుబడులను సమీకరించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరికొన్ని వారాల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అయితే ఈ  ఒప్పంద వార్తలపై స్పదించడానికి, ఓలా, సాఫ్ట్ బ్యాంక్ రెండూ  నిరాకరించాయి.  దేశంలో 4.5 లక్షల వాహనాలతో 100కుపైగా నగరాల్లో టాక్సీ సేవలుఅందిస్తున్న  ఓలా సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్, టైగర్ గ్లోబల్, మాట్రిక్స్ పార్టనర్స్,  స్టెడ్ వ్యూ కాపిటల్, సీక్వోయాఇండియా, యాక్సెల్ పార్టనర్స్, ఫాల్కన్ ఎడ్జ్ సహా వివిధ పెట్టుబడిదారుల నుండి సుమారు రూ. 8,600 కోట్ల పెట్టుబడులను సమీకరించింది.  

 భారత మార్కెట్లో తమ స్థానాన్ని బలోపేతం చేసుకోడానికి మరింత  దూకుడుగా పెట్టుబడులు పెట్టేందుకు   యోచిస్తున్నట్టు  ఇటీవల, సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ సామ  చెప్పారు. ఈ నేపథ్యంలోనే తన దాని రెండు అతిపెద్ద పెట్టుబడులు ఓలా, ఈ కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ ను ఎంచుకున్నట్టు కనిపిస్తోంది.  మరోవైపు  గతజూలైలో చైనా నిష్క్రమించిన  తరువాత భారతదేశం లో దాని కార్యకలాపాలను బాగా విస్తరించనున్నట్టు  ఉబెర్ ప్రకటించిన సంగతి  తెలిసిందే.

 

మరిన్ని వార్తలు