రహస్య పెళ్లి ట్వీట్‌తో షాకిచ్చారు!

25 Sep, 2016 19:50 IST|Sakshi
రహస్య పెళ్లి ట్వీట్‌తో షాకిచ్చారు!

ఆ జోడీ ఒలింపిక్స్‌లో మొత్తం పది స్వర్ణాలు గెలిచింది. తాజాగా ముగిసిన రియో ఒలింపిక్స్‌లోనూ ఐదు స్వర్ణాలు గెలుచుకొని తమ దేశానికి గర్వకారణంగా నిలించింది. ఆ జంట ఆదివారం తమ అభిమానులకు షాకిచ్చింది. తాము ఎవరికీ తెలియకుండా గప్‌చుప్‌గా పెళ్లిచేసుకున్నామని ఓ ట్వీట్‌ ద్వారా వెల్లడించింది. వారే బ్రిటన్‌ సైక్లింగ్‌ క్రీడాకారులు జాసన్‌ కెన్నీ, లారా ట్రోట్‌. ఈ జోడీ రియో ఒలింపిక్స్‌లో ఐదు స్వర్ణాలు గెలుచుకుంది.

జాసన్‌ కెన్నీ ఆదివారం ఓ ఆస్తకికరమైన ట్వీట్‌ చేశాడు. ’గుడ్‌ మార్నింగ్‌.. మిసెస్‌ కెన్నీ’ అంటూ మారిటల్‌ బెడ్‌ మీద ఉన్న లారా ట్రోట్‌ ఫొటోను ట్వీట్‌ చేశాడు. దీంతో వారి పెళ్లికబురు బయటి ప్రపంచానికి తెలిసింది.

జాసన్‌ కెన్నీ, లారా ట్రోట్‌ జంట శనివారం కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఈ వేడుక పూర్తిగా ప్రైవేటు వ్యవహారంగా బయటి ప్రపంచానికి ఏమాత్రం తెలియకుండా జరిగింది. ఈ పెళ్లి వేడుకను కవర్‌ చేసేందుకు ఓ మ్యాగజీన్‌ భారీమొత్తంలో ఆఫర్‌ చేసినా.. దానిని ఈ జంట తిరస్కరించినట్టు సమాచారం. మరోవైపు లారా కూడా తమ పెళ్లి వేడుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను పోస్టు చేసింది. మొత్తానికి ఇన్నాళ్లు సైక్లింగ్‌క్రీడలో జంటగా, వ్యక్తిగతంగా ఆడుతూ బ్రిటన్‌కు పలు పతకాలు తెచ్చిన కెన్నీ-లారా పెళ్లి చేసుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు