అంచనా వేశాకే కేంద్రాన్ని ఆశ్రయిస్తాం

19 Sep, 2014 20:20 IST|Sakshi
అంచనా వేశాకే కేంద్రాన్ని ఆశ్రయిస్తాం

శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌ను అతలాకుతలం చేసిన వరద బీభత్సంలో నష్టం కొన్ని వేలకోట్ల రూపాయల మేర ఉండవచ్చని, నష్టంపై సమగ్రమైన అంచనా తర్వాతే సాయంకోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శుక్రవారం చెప్పారు. నష్టానికి సంబంధించిన తుది లెక్కలు ఇప్పుడప్పుడే నిర్ధారించలేమన్నారు. శ్రీనగర్‌లో తన తాత్కాలిక కార్యాలయంలో ఒమర్ మాట్లాడుతూ, వరద కారణంగా జమ్ము కాశ్మీర్‌లోని అన్ని రంగాలూ తీవ్రంగా నష్టపోయాయని, ఇళ్లు, దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలకు, రహదార్లు, వంతెనలు, నీటి పథకాలు వంటి మౌలిక సదుపాయాలు, వరి, మొక్కజొన్న, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు.

 

నష్టాన్ని అంచనావేసే ప్రక్రియ కొనసాగుతోందని, వష్టం వివరాలను సాధ్యమైనంత త్వరగా సమీకరించాలని అన్ని జిలాల అధికారులను ఆదేశించామని చెప్పారు.

మరిన్ని వార్తలు