2014 నుంచి షేల్ గ్యాస్ ఉత్పత్తి: ఓఎన్‌జీసీ

5 Oct, 2013 03:17 IST|Sakshi

న్యూఢిల్లీ: ఓఎన్‌జీసీ కంపెనీ వాణిజ్యపరంగా షేల్  గ్యాస్ ఉత్పత్తిని వచ్చే ఏడాది ప్రారంభించనున్నది. ఈ ఏడాది 10 బావులను డ్రిల్ చేయాలని యోచిస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి వాణిజ్యపరంగా ఉత్పత్తిని చేపట్టే అవకాశాలున్నాయని ఓఎన్‌జీసీ చైర్మన్ సుధీర్ వాసుదేవ శుక్రవారం చెప్పారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) నిర్వహించిన ఇండియా ఆయిల్ అండ్ గ్యాస్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. నామినేషన్ ప్రాతిపదికన ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియాలకు కేటాయించిన బ్లాకుల్లో షేల్ గ్యాస్ ఉత్పత్తికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఇటీవలనే అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నెలలోనే గుజరాత్‌లో షేల్‌గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభించాలనుకుంటున్నామని, దీని కోసం కొనాకొ ఫిలిప్స్ సంస్థ నుంచి సాంకేతిక సహకారాన్ని తీసుకుంటున్నామని వాసుదేవ వివరించారు. గుజరాత్‌లోని కాంబే బేసిన్‌లో తొలి షేల్ గ్యాస్ బావిని ఈ సంస్థే డ్రిల్లింగ్ చేస్తోంది.

మరిన్ని వార్తలు