కేజీ బేసిన్‌లో ఓఎన్‌జీసీ భారీ పెట్టుబడులు

6 Jan, 2014 02:17 IST|Sakshi

 న్యూఢిల్లీ: కేజీ బేసిన్‌లో చమురు, సహజ వాయువు నిక్షేపాల ఉత్పత్తి నిమిత్తం ఓఎన్‌జీసీ భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. 2017-18 కల్లా 900 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నామని ఓఎన్‌జీసీ డెరైక్టర్ (ఎక్స్‌ప్లోరేషన్) ఎన్.కె. వర్మ తెలిపారు. రిలయన్స్ కేజీ-డి6 బ్లాక్‌కు పక్కనున్న కేజీ-డీడబ్ల్యూఎన్-98/2లో 11 చమురు, గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నామని,  నార్తర్న్ డిస్కవరీ ఏరియా(ఎన్‌డీఏ) బ్లాక్ నుంచి ఏడాదికి 2.5-3 మిలియన్ టన్నులు చమురును, రోజుకు 9-10 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేయాలనుకుంటున్నామని వివరించారు. ఎన్‌డీఏలో 92.30 మిలియన్ టన్నుల చమురు, 97.568 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు