గుజరాత్ నూతన గవర్నర్‌గా ఓపీ కోహ్లీ

16 Jul, 2014 20:08 IST|Sakshi
గుజరాత్ నూతన గవర్నర్‌గా ఓపీ కోహ్లీ

గాంధీనగర్: గుజరాత్ నూతన గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ ఎంపీ ఓపీ కోహ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భాస్కర్ భట్టాచార్య ప్రమాణ స్వీకారం చేయించారు. కోహ్లీని గవర్నర్ గా రాష్ట్రపతి నియమించారని అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరిష్ సిన్హా లేఖ చదివి వినిపించారు.

78 ఏళ్ల ఓపీ కోహ్లీ గుజరాత్ కు 24వ గవర్నర్ కావడం గమనార్హం. డాక్టర్ కమలా బెనీవాల్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. బెనీవాల్ (87) పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనున్నప్పటికీ కేంద్రం ఆమెపై బదిలీ వేటు వేసింది. ఆమెను మిజోరం గవర్నర్‌గా నియమించింది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా