‘ఓఎన్‌జీసీ’లో ఓపెనింగ్ పొజిషన్లు

14 Oct, 2015 10:01 IST|Sakshi
‘ఓఎన్‌జీసీ’లో ఓపెనింగ్ పొజిషన్లు

ఓఎన్‌జీసీ పెట్రో అడిషన్స్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ (ఖాళీలు- 254), నాన్ ఎగ్జిక్యూటివ్ (ఖాళీలు-77) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 25. వివరాలకు www.opalindia.in
         
సెయిల్‌లో ఫైర్‌మ్యాన్ కమ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్లు
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. ఫైర్‌మ్యాన్ కమ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ (ట్రైనీ) (ఖాళీలు-11) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వయసు 28 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుకి చివరి తేది నవంబర్ 9. వివరాలకు www.sail.co.in చూడొచ్చు.

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ప్రొఫెసర్లు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్ (ఖాళీలు-17 ), అసోసియేట్ ప్రొఫెసర్ (ఖాళీలు-18), అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఖాళీలు-22) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 16. వివరాలకు www.uohyd.ac.in చూడొచ్చు.

‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్’లో పోస్టులు
సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్.. తాత్కాలిక ప్రాతిపదికపై రీసెర్‌‌చ ఆఫీసర్ (ఖాళీలు-4), అసిస్టెంట్ రీసెర్‌‌చ ఆఫీసర్ (ఖాళీలు-18), ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఖాళీలు-8) పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇంటర్వ్యూ తేది అక్టోబర్ 26. వివరాలకు www.nimhindia.gov.in చూడొచ్చు.

రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌లో స్టాఫ్ నర్సులు
న్యూఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్.. కాంట్రాక్టు పద్ధతిలో స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 187. వయసు 30 ఏళ్లకు మించకూడదు. ఇంటర్వ్యూ తేది అక్టోబర్ 20. వివరాలకు http://mohfw.gov.in చూడొచ్చు.

బార్క్ లో టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్లు
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్).. వికలాంగులకు రిజర్‌‌వ చేసిన టెక్నికల్ ఆఫీసర్/డి (ఆర్కిటెక్ట్) (ఖాళీలు-1), సైంటిఫిక్ అసిస్టెంట్/బి (కంప్యూటర్ సైన్‌‌స) (ఖాళీలు-1), సైంటిఫిక్ అసిస్టెంట్/బి (ఎలక్ట్రానిక్స్) (ఖాళీలు-3) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 3. వివరాలకు www.barc.gov.in చూడొచ్చు.

అదితి మహావిద్యాలయలో నాన్  టీచింగ్ స్టాఫ్
అదితి మహావిద్యాలయ (యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ).. కాంట్రాక్టు పద్ధతిలో సిస్టం అండ్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ (ఖాళీలు-1), లైబ్రరీ అటెండెంట్ (ఖాళీలు-1), ఎంటీఎస్ (ల్యాబ్ అటెండెంట్) (ఖాళీలు-1), ఎంటీఎస్ (మినిస్టీరియల్) (ఖాళీలు-5) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 16. వివరాలకు  www.amv94.org చూడొచ్చు.

బాంబే ఐఐటీలో వివిధ పోస్టులు  
బాంబేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. తాత్కాలిక ప్రాతిపదికపై వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు 26. పూర్తి వివరాలకు www.ircc.iitb.ac.in చూడొచ్చు.

మరిన్ని వార్తలు