బంద్ను ఆపాలని చూస్తోంది

10 Oct, 2015 08:13 IST|Sakshi

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం మాని బంద్ను ఆపాలని చూస్తోంది తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీల నేతలు  ఆరోపించారు. ఈ ప్రభుత్వం రైతులకు ఒకే దఫా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తెలంగాణ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలు బంద్కు పిలుపునిచ్చారు. అయితే శనివారం రాష్ట్రంలోని వివిధ బస్సు డిపోల వద్ద బంద్ నిర్వహిస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సదరు పార్టీల నేతలు స్పందించారు.

నేతల అరెస్ట్ అప్రజాస్వామికమని వారు ఆరోపించారు. తాము పిలుపు నిచ్చిన బంద్కి అన్ని వర్గాల మద్దతు ఉందన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతు రుణాలు ఒకే దఫాలో మాఫీ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము పిలుపు నిచ్చిన బంద్ను టీఆర్ఎస్ ముఖ్యనేతలు మినహా ఎవరూ వ్యతిరేకించడం లేదని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాల నాయకులు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు