ఒరాకిల్ భారీ డీల్

28 Jul, 2016 20:00 IST|Sakshi
ఒరాకిల్ భారీ డీల్

ప్రపంచ డేటా బేస్ విపణిలో సింహభాగాన్ని ఆక్రమిస్తున్న సాప్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్, క్లౌడ్ సాప్ట్ వేర్ కంపెనీ నెట్సూట్ను భారీ మొత్తంలో కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ డీల్ విలువ 9.3 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.62,407కోట్లు)గా వెల్లడించింది. వేగవంతంగా పెరుగుతున్న క్లౌడ్ మార్కెట్లో తన బిజినెస్లను విస్తరించడానికి ఈ డీల్ కుదుర్చుకున్నట్టు తెలిపింది.ఈ కొనుగోలు డీల్తో  నెట్సూట్ షేర్లు ఒక్కసారిగా 18.6శాతానికి ఎగిసి, అంతర్జాతీయంగా ప్రీమార్కెట్ ట్రేడింగ్లో 108.64 డాలర్లుగా రికార్డు అయ్యాయి. అదేవిధంగా ఒరాకిల్ షేర్లు సైతం 1.6శాతం పెరిగి, ప్రీమార్కెట్ ట్రేడింగ్లో 41.3డాలర్లుగా నమోదయ్యాయి.

ఈ అగ్రిమెంట్ ప్రకారం నెట్సూట్ ఒక్క షేరుకు ఒరాకిల్ 109 డాలర్లను చెల్లించనుంది.ఒరాకిల్, నెట్సూట్ రెండు సంస్థలు మార్కెట్ ప్లేస్ లో దీర్ఘకాలం కలిసి పనిచేస్తాయని ఒరాకిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ హర్డ్ తెలిపారు. సాప్ట్ వేర్ దిగ్గజంగా ఉన్న ఒరాకిల్తో ఈ డీల్ కుదుర్చుకోవడం, తమ క్లౌడ్ సొల్యూషన్లు చాలా పరిశ్రమలకు, దేశాలకు విస్తరిస్తాయని నెట్సూట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాచ్ నెల్సన్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఒరాకిల్ లో జాయిన్ అవ్వడం చాలా గర్వంగా భావిస్తున్నామని, తమ నూతనావిష్కరణలు పెంచుకుంటామని తెలిపారు.  

తన ప్రత్యర్థులు ఎస్ఏపీ ఎస్ఈ, మైక్రోసాప్ట్ కార్పొరేషన్ లకు పోటీగా ఒరాకిల్ క్లౌడ్ బేస్డ్ మోడల్ లపై తన బిజినెస్ లను మరల్చాలని కంపెనీ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒరాకిల్, నెట్సూట్ను కొనుగోలు చేయబోతుందని పేర్కొంది. 1998లో నెట్సూట్ను స్థాపించారు. క్లౌడ్ కంప్యూటింగ్ రెవల్యూషన్లో నెట్సూట్ ముందంజలో ఉంది.ఇంటర్నెట్ ద్వారా బిజినెస్ అప్లికేషన్లు అందించడంలో ఈ కంపెనీనే మొదటిది. క్లౌడ్ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచడానికి ఒరాకిల్ ఇప్పటికే టెక్స్టురా, ఓపవర్ వంటి కంపెనీలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు