ఆస్కార్ విలువెంతో తెలిస్తే షాక్!

26 Feb, 2017 09:46 IST|Sakshi
ఆస్కార్ విలువెంతో తెలిస్తే షాక్!
బంగారం వర్ణంలో మెరిసిపోయే ఆస్కార్ కు వినోద రంగంలో ఉన్న గౌరవం అంతా ఇంతా కాదు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ గోల్డెన్ ఆస్కార్ను ఒక్కసారైనా ఇంటికి తీసుకెళ్లాలి అని ప్రతి ఒక్క ఆర్టిస్టూ ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ ఆ అదృష్టం కొద్దిమందికే వరిస్తూ ఉంటోంది. బంగారు రంగుల్లో మెరిసిపోయే ఈ ఆస్కార్ విలువెంతో అసలు ఎప్పుడైనా, ఎవరైనా గెస్ చేశారా? ఈ ఆస్కార్ విలువ కేవలం 10 డాలర్లేనట అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.666 మాత్రమే. అయితే ఈ విగ్రహం తయారుచేయడానికి అయ్యే ఖర్చు మాత్రం 400 డాలర్లు(రూ.26,655).
 
ఒకవేళ దీన్ని  ఆక్షన్కు పెట్టాలనుకుంటే రూల్స్ ప్రకారం ఈ ట్రోఫికి 10 డాలర్లను అకాడమీ ఆఫ్ మోషన్ ఫిక్చర్ ఆర్ట్ అండ్ సైన్సెస్(ఏఎమ్పీఏఎస్) కు చెల్లించాల్సి ఉంటుంది.  2015 నుంచి ఈ నిబంధనను కోర్టు అమలుచేస్తూ వస్తోంది. ఈ రూల్ను సమర్థిస్తూ వస్తున్న ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు, ఆస్కార్ విన్నర్ స్టీవెన్ స్పీల్ బర్గ్,  బెట్ డేవిస్, క్లార్క్ గేబుల్‌కు చెందిన ఆస్కార్‌లపై 1.36 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. వీటిని తిరిగి అకాడమీకి విరాళంగా ఇవ్వడానికే ఆయన ఇంత ఖర్చు చేశారట.
మరిన్ని వార్తలు