5 రాష్ట్రాల్లో 5800 టన్నుల పప్పుధాన్యాలు స్వాధీనం

20 Oct, 2015 16:17 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోవడంతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించింది. క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ, వినియోగదారుల శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ధరల నియంత్రణకు కేంద్రం తీసుకుంటున్న చర్యల గురించి వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి సి.విశ్వనాథ్ మీడియాకు వివరించారు. ఇప్పటికే కందిపప్పు ధర డబుల్ సెంచరీకి చేరడంతో దేశవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరమైన విషయం తెలిసిందే.

అక్రమంగా నిల్వలు, కృతిమ కొరత సృష్టిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని... అరెస్టులకు కూడా వెనుకడమని చెప్పారు. గత కొద్ది నెలలగా జరిపిన దాడుల్లో  ఐదు రాష్ట్రాల్లో 5800 టన్నుల పప్పుధాన్యాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యాధికంగా 2549 టన్నులు, మధ్యప్రదేశ్ నుంచి 2295 టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 600 టన్నులు దీంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భారీగా పప్పు ధాన్యాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దేశవ్యాప్తంగా దాడులను కొనసాగిస్తున్నామని... దీనివల్ల ధరలు కొంత వరకు నియంత్రించగలిగామని చెప్పారు. ఎప్పుటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతూ పంట దిగుబడులు పెంచడానికి కృషి చేస్తున్నామన్నారు. విదేశాల నుంచి పప్పుధాన్యాల దిగుబడి చేసుకుంటున్నామని...త్వరలోనే ధరలను నియంత్రిస్తామని విశ్వనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు