హక్కుల సాధనకు గౌడ కులస్తులు ఏకం కావాలి: పొన్నం

13 Sep, 2015 00:15 IST|Sakshi
హక్కుల సాధనకు గౌడ కులస్తులు ఏకం కావాలి: పొన్నం

హైదరాబాద్: గౌడ కులస్తులంతా ఏకతాటిపైకి వచ్చి తమ హక్కులను సాధించుకోవాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శనివారం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో తెలంగాణ గౌడ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హజరైన పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌడ కులస్తుల సంక్షేమానికి చిన్నాచితకా సంఘాలు కాకుండా అన్ని సంఘాలు ఒకే గొడుగు కిందికి వచ్చి సత్తా చాటాలని  పిలుపునిచ్చారు.

సాక్షాత్తూ మంత్రి అయ్యి ఉండి విస్కీ తాగితే ఆయుష్షు పెరుగుతుందని చెప్పడం సబబు కాదని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావునుద్దేశించి అన్యాపదేశంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పోలీసులకు అధికారం ఇచ్చి దాడులు చేయించి గౌడ కులస్తులను అణచివేసే కుట్ర చేస్తోందన్నారు. ఈ సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు నర్సగౌడ్,  సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లే లక్ష్మణ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి శశిధర్‌రావు, ఉపాధ్యక్షుడు రమేశ్‌గౌడ్‌తో పాటు 10 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.  
 
 

మరిన్ని వార్తలు