నాగాలాండ్ గవర్నర్ గా ఆచార్య ప్రమాణ స్వీకారం

19 Jul, 2014 18:15 IST|Sakshi
నాగాలాండ్ గవర్నర్ గా ఆచార్య ప్రమాణ స్వీకారం

కోహిమా: నాగాలాండ్ నూతన గవర్నర్ గా పీ బీ ఆచార్య శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ల సంఖ్య 19 కు చేరింది. నాగాలాండ్ కు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఆచార్య.. త్రిపుర గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం తలపెట్టిన గవర్నర్ల నియామకం ఎపిసోడ్ తో కొన్ని రాష్ట్రాల్లో పని చేస్తున్న వారికి స్థానం చలనం కలగగా, మరి కొందరు కొత్తగా గవర్నర్లగా నియమితులైయ్యారు.ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ గా ఉన్న 1995-2000  కాలంలో ఆచార్య పార్టీ జాతీయ కార్యదర్శిగా పని చేశారు. 1948 లో ఆర్ఎస్ఎస్ లో చేరిన ఆచార్య ఆరు నెలల పాటు జైలు శిక్షకూడా అనుభవించారు.

 

ఆర్ఎస్ఎస్ ను ప్రభుత్వం నిషేధించిన అనంతరం ఆయన ముంబై యూనివర్శిటీ పాలక సభ్యునిగా 30 సంవత్సారాలు పాటు సేవలు అందించారు.తదుపరి ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన ఆచార్యను జూలై 14 న నాగాలాండ్ గవర్నర్ గా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నియమించారు.

మరిన్ని వార్తలు