సేవల రంగం నుంచే కొత్త కంపెనీల జోరు

23 Dec, 2013 01:36 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అక్టోబరులో 6,586 కంపెనీలు కొత్తగా నమోదయ్యాయి. ఇందులో 70 శాతం కంపెనీలు సేవల రంగం నుంచి రావడం విశేషం. రంగాల వారీగా చూస్తే పరిశ్రమలు, వ్యవసాయం ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక వీటన్నిటి అధీకృత మూలధనం రూ.2,833.87 కోట్లని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం. అక్టోబరులో 20 విదేశీ కంపెనీలు భారత్‌కు వచ్చిచేరాయి. వీటిలో మహారాష్ట్ర, కర్నాటక  రాష్ట్రాలు ఒక్కొక్కటి ఆరు కంపెనీలను ఆకర్శించాయి. మొత్తంగా మహారాష్ట్రలో 1,304, ఢిల్లీలో 1,149, ఉత్తర ప్రదేశ్‌లో 536 కంపెనీలు కొత్తగా అడుగుపెట్టాయి. అక్టోబరు చివరినాటికి దేశంలో నమోదిత కంపెనీల సంఖ్య 13.5 లక్షలు. 9.12 లక్షల కంపెనీలు చురుకుగా ఉన్నాయి. 2.65 లక్షల కంపెనీలు మూతపడ్డాయి.

మరిన్ని వార్తలు