నోట్లరద్దుతో పాక్‌ ఐఎస్‌ఐ కొత్త కుయుక్తులు!

17 Nov, 2016 17:44 IST|Sakshi
నోట్లరద్దుతో పాక్‌ ఐఎస్‌ఐ కొత్త కుయుక్తులు!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ)పైనా తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో తనవద్ద పెద్దమొత్తంలో ఉన్న భారత కరెన్సీని మార్చుకోవడానికి తెరచాటు యత్నాలకు దిగుతున్నట్టు సమాచారం. తన వద్ద ఉన్న పాత కరెన్సీని ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున మార్చుకునేందుకు ఐఎస్‌ఐ ప్రయత్నిస్తున్నట్టు నిఘావర్గాలకు సమాచారం అందింది.

దీంతో దేశంలోని బ్యాంకులన్నింటినీ ఇంటెలిజెన్స్‌ అధికారులు అప్రమత్తం చేశారు. బ్యాంకుల్లో పెద్దమొత్తంలో డిపాజిట్‌ అయ్యే నగదు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశంలోకి పెద్ద ఎత్తున నకలీ కరెన్సీని తరలించి.. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని ఐఎస్‌ఐ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్న  సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు