తుపాకులు పట్టిన టీచర్లు!

3 Feb, 2015 14:52 IST|Sakshi
తుపాకులు పట్టిన టీచర్లు!

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో టీచర్లు తుపాకులు పట్టారు. తమను తాము కాపాడుకోవడంతో పాటు విద్యార్థులనూ రక్షించేందుకు తుపాకులను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఉగ్రమూకల దాడులను కాచుకునేందుకు ఆయుధాలు ధరించారు.

పెషావర్ సైనిక పాఠశాలలో ఉగ్రవాదులు సాగించిన రాక్షస క్రీడలో 140 మందిపైగా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఖైబర్ ఫఖ్తున్వా ప్రావెన్స్ లోని స్కూల్స్ కు భద్రత కట్టుదిట్టం చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా టీచర్లకు తుపాకులిచ్చారు. అంతేకాదు వాటిని ఎలా వాడాలో కూడా శిక్షణనిచ్చారు.

ఫ్రంటీరియల్ కాలేజీలో 8 మంది మహిళా ఉపాధ్యాయులు ఇప్పటికే శిక్షణ తీసుకున్నారు. రిటైర్డ్ ఆర్మీ అధికారి, మహిళా అధికారి ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పిస్టోలు, ఏకే-47 తుపాకులు ఎలా పేల్చాలో ఇందులో నేర్పించారు.

భద్రతా చర్యల్లో భాగంగా పాఠశాలల్లో సీసీ కెమెరాలు, ముళ్లకంచె పెన్సింగ్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. అయితే టీచర్ల  తుపాకులు ఇవ్వడాన్ని కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. ఇది గన్ కల్చర్ కు దారితీసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు