వాలెంటైన్స్ డే వేడుకలపై నిషేధం

13 Feb, 2017 14:34 IST|Sakshi
వాలెంటైన్స్ డే వేడుకలపై నిషేధం
పాకిస్తాన్ : వాలెంటైన్ డే వేడుకలకు ఇప్పటికే యువత భారీ ఎత్తున్న ప్లాన్స్ వేసేసుకుని ఉంటారు.  ఈ వేడుకను ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలనుకుంటున్న వారికి ఇస్లామాబాద్ హైకోర్టు షాకిచ్చింది. దేశ రాజధాని ప్రాంతంలో వాలెంటైన్స్ డే వేడుకలను నిషేధం విధిస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. ఇది ముస్లిం సంప్రదాయం కాదంటూ విచారణ సమయంలో పిటిషన్దారుడు వాదించడంతో పాటు వెంటనే వీటిపై నిషేధం విధించాలని కోరారు. వారి వాదనలు విన్న కోర్టు వాలెంటైన్స్ డేకు సంబంధించిన వేడుకలను బహిరంగ ప్రదేశాల్లో జరుపుకోవద్దంటూ  ఆదేశాలు జారీచేసింది. కార్యలయాలోనూ వీటిపై నిషేధ ఆంజ్ఞలు విధించింది.
 
లవ్ను ప్రమోట్ చేసే విధంగా ఈ వేడుకలను ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలు కూడా కవరేజ్ చేయకూడదని గట్టి ఆదేశాలు జారీచేసింది. దీనిపై పదిరోజులోగా తమకు  సమాధానం ఇవ్వాలని సమాచార మంత్రిత్వ శాఖ, ఫెడరల్ ప్రభుత్వం, ఫెమ్రా చైర్మన్, చీఫ్ కమిషనర్లను కోర్టు ఆదేశించింది. గతేడాదే అధ్యక్షుడు మామ్నూన్ హుస్సేన్ దేశంలో వాలెంటైన్స్ డే వేడుకలు జరుపుకోవద్దంటూ గట్టిగా వారించారు. వాలంటైన్స్ డే పాకిస్థాన్ సంస్కృతి కాదని, దేశంలో ఎవరూ దానిని జరుపుకోవద్దని, నిషేధించాలని యువతకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పాశ్చాత్య దేశాల్లో ప్రేమికులు సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలు జరుపుకొంటారని, ముస్లిం మతస్థులు ఉన్న దేశంలో దానికి చోటులేదన్నారు. తమ సంప్రదాయాలను, జాతి గుర్తింపును  తప్పనిసరిగా పాటించాలన్నారు. 
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు