అఫ్ఘాన్‌లో దాడి వెనుక పాక్ సైనికాధికారుల ప్రమేయం!

13 Jan, 2016 00:49 IST|Sakshi

కాబూల్: అఫ్గానిస్తాన్‌లోని మజార్ ఏ షరీఫ్‌లోని భారత ఎంబసీపై టైస్టు దాడి వెనుక పాక్ సైనికాధికారుల పాత్ర స్పష్టంగా ఉన్నట్లు అఫ్గాన్ పోలీస్ అధికారి ఒకరు మంగళవారం చెప్పారు. ‘ఈ వ్యవహారాన్ని మన సొంత కళ్లతో చూస్తే నిజం తేటతెల్లమవుతుంది..  దాడి చేసిన వారు పాక్  మిలటరీకి సంబంధించిన దాడిలో వారి ఎత్తుగడలన్నీ పాక్ మిలటరీవే’ అని బల్ఖ్ రాష్ట్ర పోలీస్ చీఫ్ సయ్యద్  సదత్ తెలిపారు. దాడి చేసిన ముష్కరులు సరిహద్దులు దాటి వచ్చారని, వారు మిలటరీ శిక్షణ పొందినవారేనని.. బాగా చదువుకుని, నిఘాపై  పూర్తి అవగాహన ఉన్నవారని సదత్ తెలిపారు. వారు అఫ్గాన్‌లోని ‘దరి, పష్తు’ భాషలు మాట్లాడలేదని.. ఉర్దూలోనే మాట్లాడారని చెప్పారు.

ఈ నెల మూడున మజర్ ఎ షరీఫ్‌లోని భారత మిషన్ బిల్డింగ్‌పై జరిగిన ఉగ్రదాడిలో ఓ పోలీసు అధికారి చనిపోగా, 9 మంది గాయపడడం తెలిసిందే.

మరిన్ని వార్తలు