శిలాయుగం నాటి రాకాసి గుళ్లు

10 Aug, 2015 00:50 IST|Sakshi
శిలాయుగం నాటి రాకాసి గుళ్లు

రఘునాథపల్లి: వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం మాదారంలో బృహద్ శిలా యుగం నాటి రాకాసిగుళ్లను జనగామకు చెందిన చరిత్ర పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి ఆదివారం వెలుగులోకి తెచ్చారు. గ్రామ అనంతరాయి గుట్టకు సమీపంలోని కర్ల మల్లారెడ్డి వ్యవసాయ భూమిలో క్రీస్తు పూర్వం వెయ్యి ఏళ్ల క్రితం నాటి సమాధులను గుర్తించారు. ఈ సందర్భంగా రత్నాకర్‌రె డ్డి మాట్లాడుతూ సమాధులకు గుర్తుగా నిలువు రాళ్లు పాతే సంస్కృతి నాటి బృహద్ శిలాయుగంలో ఉండేదని తెలిపారు. స్థానికులు ఆ రాళ్లను పొడుగు రాళ్లని అంటారని..

వాస్తవానికి ఈ సమాధులను రాకాసిగుళ్లుగా పిలుస్తారని వివరించారు. సమాధులకు గుర్తుగా ఉన్న నిలువు రాయి 2 మీటర్ల ఎత్తు, 4 మీటర్ల వెడల్పుతో ఉన్నట్లు చెప్పారు. ఇక్కడ దక్కన్ పీఠభూమి ఉపరితలంపై ముడి ఇనుము, ఉక్కుతో ఆయుధాలు, పనిముట్లు తయారు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసినట్లు ఆధారాలు దొరికాయని తెలిపారు. అనంతరాయి గుట్టకు తెల్లరాయి బండపై రాతి పరికరాలు నరుకుతున్న గుర్తులు ఉన్నాయని అన్నారు.

మరిన్ని వార్తలు