శివసేన ఎమ్మెల్యే హఠాన్మరణం

24 May, 2015 11:04 IST|Sakshi

పాల్గార్: శివసేన ఎమ్మెల్యే కృశాన్ ఘొడా(61) హఠ్మానరణం చెందారు. గుండెపోటులో ఆదివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. మహారాష్ట్రలోని పాల్గార్ జిల్లా దహాను అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతనిథ్యం వహిస్తున్నారు. పాల్గార్ జిల్లాలో ఓ పెళ్లికి హాజరయి తిరిగి వస్తుండగా చరోటి చెక్ పోస్టుకు సమీపంలో తెల్లావారుజామున 2 గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు వచ్చింది.

వెంటనే వాపి ప్రాంతంలోని హరియా ఆస్పత్రికి ఆయనను తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. కృశాన్ ఘోడా అంత్యక్రియలు ఆయన స్వగ్రామం రణషీత్ లో నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు