శశికళ ఎన్నికపై ఈసీకి ఫిర్యాదు

16 Feb, 2017 14:53 IST|Sakshi
శశికళ ఎన్నికపై ఈసీకి ఫిర్యాదు

న్యూఢిల్లీ: శశికళ, ఆమె కుటుంబ సభ్యులపై పన్నీర్‌ సెల్వం పోరాటం కొనసాగిస్తున్నారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదంటూ జాతీయ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. పన్నీర్‌ సెల్వం తరపున ఎంపీ వి. మైత్రేయన్‌ గురువారం మధ్యాహ్నం ఈసీ అధికారులను కలిశారు. పార్టీ పరంగా శశికళ, ఆమె తనయుడు దినకరణ్ ఎన్నిక చెల్లదని ఫిర్యాదు చేశారు.

జైలుకు వెళ్లే ముందు శశికళ... దినకరన్‌ ను అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తన కుటుంబానికి పలువురికి కూడా పదవులు కట్టబెట్టారు. దీనిపై వ్యతిరేకత వచ్చినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. పార్టీని శశికళ కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్లనిచ్చేది లేదని పన్నీర్‌ సెల్వం ప్రతిన బూనారు. చిన్నమ్మకు వ్యతిరేకంగా చివరివరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.