సీఎంగా పన్నీర్ సెల్వం

6 Dec, 2016 05:21 IST|Sakshi
సీఎంగా పన్నీర్ సెల్వం

సోమవారం అర్ధరాత్రి దాటాక ప్రమాణ స్వీకారం.. శశికళకు పార్టీ నాయకత్వ బాధ్యతలు
 
 చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తమిళనాడు ముఖ్యమంత్రి గా పన్నీర్‌సెల్వం నియమితులయ్యారు. అలాగే పార్టీ నాయకత్వ బాధ్యతలు జయలలిత నెచ్చెలి శశికళకు అప్పగించాలని అన్నాడీఎంకే ఉన్నత స్థారుు సమావేశం సూత్ర ప్రాయంగా నిర్ణరుుంచింది. దీనిపై పార్టీలో కొంతమేరకు అసంతృప్తి వ్యక్తం అరుునప్పటికీ చివరికి ఇదే ఖరారైనట్లు అన్నా డీఎంకే వర్గాలు చెబుతున్నారుు. జయలలిత తదనంతరం ప్రభుత్వ, పార్టీ రథసారధులను ఎంపిక చేసుకోవడానికి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు సోమవారం ఉదయం అపోలో ఆసుపత్రిలో సమావేశమయ్యారు. దీనికి ముందు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు విడిగా శశికళను కలిశారు. ఆ తర్వాత పన్నీర్ సెల్వంతో పాటు మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు శశికళను కలసి భవిష్యత్ ఏర్పాట్ల గురించి  చర్చించారు.

రాత్రి 7 గంటలకు అన్నా డీఎంకే ప్రధాన కార్యాలయంలో  ప్రిసైడింగ్ చైర్మన్ మధుసూధన్ అధ్యక్షతన లెజిస్లేచర్ పార్టీ సమావేశమైంది. పన్నీర్‌ను సీఎం చేయడానికి అనుకూలంగా మెజారిటీ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన విషయం ఇక్కడ చర్చకు వచ్చింది. శశికళ కూడా పన్నీర్ వైపే ఉన్నారని ఆమె మద్దతుదారులైన శాసనసభ్యులు వెల్లడించారు. పన్నీర్‌ను సీఎం చేసి శశికళకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చే విషయమై చర్చ జరిగింది. ప్రతిసారి పన్నీర్‌కే అవకాశం ఎందుకు ఇవ్వాలని మంత్రి ఎడపాడి పళనిస్వామి, ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీతో పాటు మరికొందరు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారని తెలిసింది.

శశికళకు పార్టీ పగ్గాలు అప్పగించే ప్రతిపాదనను సైతం సుమారు 45 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని, పార్టీని బతికించుకోవాలంటే ఇంతకు మించి మార్గం లేదని మరికొందరు తమ అభిప్రాయం వెల్లడించారు. ఏదిఏమైనా  కేంద్ర ప్రభుత్వం ఈ  పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఇవ్వరాదనే అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. కాగా పన్నీర్ సెల్వం 2001లో ఆపద్ధర్మ సీఎంగా, 2015లో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు, 2016 సెప్టెంబర్ 22 నుంచి ఆపద్ధర్మ సీఎంగా పని చేశారు.