పారాసిటమాల్‌తో పిల్లలపై దుష్ప్రభావం

2 Jul, 2016 22:11 IST|Sakshi
పారాసిటమాల్‌తో పిల్లలపై దుష్ప్రభావం

లండన్: కాస్త ఒళ్లు వెచ్చబడగానే వేసుకునే ట్యాబ్లెట్ పారాసిటమాల్. అయితే దీనిని గర్భధారణ సమయంలో ఎక్కువగా వినియోగించడంవల్ల పుట్టబోయే పిల్లల్లో దుష్ఫలితాలు కలుగుతాయంటున్నారు వైద్యనిపుణులు. స్పెయిన్‌లోని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎన్విరాన్‌మెంటల్ ఎపిడమాలజీకి చెందిన పరిశోధకులు 2644 మంది మహిళలపై పరిశోధన చేసి పలు విషయాలను వెల్లడించారు.

ఆ వివరాల ప్రకారం.. మొదటి 32 వారాలు పారాసిటమాల్ వాడిన గర్భవతులకు పుట్టిన పిల్లల్లో 43 శాతం మంది చిన్నారుల్లో ఏడాదికి, 41 శాతం పిల్లల్లో ఐదేళ్లకు ఈ ప్రభావం కనిపించింది. శారీకంగా రోగనిరోధక శక్తి దెబ్బతినడమే కాకుండా మానసికంగా కూడా దుష్ఫలితాలు కనిపించాయి. ప్రధానంగా ఆటిజం వంటి సమస్యకు పారాసిటమాల్ కారణమని తేలింది. పెద్దగా ఏ విషయంపైనా ఆసక్తి చూపకపోవడం, లేదంటే అతిగా ఆసక్తి ప్రదర్శించడం, తీవ్ర భావోద్వేగాలు వంటివి కూడా పారాసిటమాల్ తాలూకు ప్రభావాలే.

మరిన్ని వార్తలు