8 రోజులు అడ్డుకుంటే చాలు

11 Feb, 2014 02:14 IST|Sakshi

 సీమాంధ్ర ఎంపీల వ్యూహం
 సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటే ప్రస్తుతానికి రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేయగలుగుతామని పలువురు సీమాంధ్ర ఎంపీలు అభిప్రాయపడ్డారు. సమావేశాల గడువు ఇంకా ఎనిమిది రోజులే ఉన్నందున ఈ లోపు నిరసనలు, ఆందోళనలు... ఇలా ఏ పద్ధతిలోనైనా సభను అడ్డుకునేందుకు పార్టీలకతీతంగా సీమాంధ్ర ప్రాంత ఎంపీలంతా సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చ తదితర అంశాలపై ఢిల్లీలోని వైఎంసీఏ కాన్ఫరెన్స్‌హాల్‌లో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం (ఏపీజేఎఫ్) ఆధ్వర్యంలో ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణాంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన సెమినార్‌లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, సబ్బంహరి, టీడీపీ ఎంపీలు నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాలరెడ్డి, సుజనాచౌదరి, సీఎం రమేశ్, ఏపీఎన్‌జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, పలు సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సభలో కేవీపీ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలోనే తెలుగువారి అభివృద్ధి సాధ్యమని నమ్మే వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి పొందిన స్ఫూర్తితోనేతాను ఉద్యమంలో పాల్గొంటున్నానని చెప్పారు. ఉండవల్లి మాట్లాడుతూ రాజ్యసభలో బిల్లుపెడితే దానికి ఎప్పటికీ కాల దోషం ఉండదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుగా అక్కడ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

>
మరిన్ని వార్తలు