బుద్ధగయ, పాట్నా పేలుళ్ల మధ్య పోలిక

29 Oct, 2013 13:01 IST|Sakshi

బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం సంభవించిన వరుస బాంబు పేలుళ్లు, ఈ ఏడాది జులైలో బుద్ధగయలో చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్లు ఒకేలా ఉన్నాయని జార్ఖండ్ పోలీసు ఉన్నతాధికారి ఎస్.ఎన్. ప్రధాన్ వెల్లడించారు. ఇరు ప్రాంతాలలో జరిగిన బాంబు పేలుళ్లలో వాడిని టైమర్లు ఒకటేనని తమ దర్యాప్తులో వెల్లడైందని, అలాగే ఆ పేలుళ్ల వెనక పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా అనుబంధ సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని తమ ప్రాధమిక విచారణలో వెల్లడైందని తెలిపారు.

 

అయితే పాట్నాలో వరుస బాంబు పేలుళ్ల జరిగినప్పుడు ప్రజలు తీవ్ర ఆందోళనతో నలువైపులకు పరుగులు తీశారు. ఆ క్రమంలో తొక్కిసలాట జరిగింది. దీంతో చాలా సాక్ష్యాలు కనుమరుగు అయ్యాయని తెలిపారు. ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ హుంకార్ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీకి కొన్ని గంటల ముందు పాట్నాలో పలు వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఆ ఘటనలో పలువు మరణించారు. అనేక మంది గాయపడిన సంగతి తెలిసిందే.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు