రియల్టీలో పీఈ పెట్టుబడుల జోరు

6 Dec, 2013 01:07 IST|Sakshi
రియల్టీలో పీఈ పెట్టుబడుల జోరు

 న్యూఢిల్లీ: ఓవైపు ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ రియల్టీ రంగానికి సంబంధించి ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు పుంజుకున్నాయి. ఈ ఏడాది(2013) తొలి తొమ్మిది నెలల కాలం(జనవరి-సెప్టెంబర్’13)లో 26% అధికంగా రూ. 4,716 కోట్ల(75.5 కోట్ల డాలర్లు) పెట్టుబడులు నమోదయ్యాయి. ఆఫీస్ బిల్డింగ్‌ల ద్వారా లభిస్తున్న లీజు సంబంధిత ఆదాయం ఇందుకు కారణంగా నిలిచినట్లు రియల్టీ గ్లోబల్ కన్సల్టెంట్ సంస్థ కుష్‌మాన్ అండ్ వేక్‌ఫీల్డ్ పేర్కొంది.
 
 దీంతో దేశీ రియల్టీ రంగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు పుంజుకున్నాయని వివరించింది. కాగా, గతేడాది అంటే 2012 తొలి మూడు క్వార్టర్లలో ఈ పెట్టుబడులు రూ. 3,750 కోట్లు(70.4 కోట్ల డాలర్లు) మాత్రమేనని తెలిపింది. ఈ ఏడాది ఇప్పటివరకూ లభించిన పెట్టుబడుల్లో 65% అంటే రూ. 3,078 కోట్లు(49.3 కోట్ల డాలర్లు) కేవలం మూడో క్వార్టర్(జూలై-సెప్టెంబర్’13)లోనే లభించినట్లు వెల్లడిం చింది. వీటిలో ఆఫీస్ విభాగంలో పెట్టుబడులు రెట్టింపై రూ. 2,476 కోట్లకు చేరగా, గృహ విభాగంలో 11% క్షీణించి రూ. 2,240 కోట్లకు పరిమిత మయ్యాయి.
 

>
మరిన్ని వార్తలు