విమానాల్లో వచ్చారు.. భిక్షమెత్తారు!

13 Jan, 2017 19:49 IST|Sakshi
విమానాల్లో వచ్చారు.. భిక్షమెత్తారు!

హోసపేటె: అభివృద్ధి చెందిన దేశాల నుంచి విలాసంగా విమానాల్లో వచ్చారు. అయినా భిక్షమెత్తారు. 30 దేశాల నుంచి సుమారు 100 మందికి  పైగా విదేశీయుల పర్యాటకుల బృందం కర్ణాటకలో ప్రపంచ ప్రసిద్ది గాంచిన పర్యాటక కేంద్రమైన బళ్లారి జిల్లాలోని హంపినీ వీక్షించేందుకు వచ్చింది. కొద్దిరోజులుగా వీరంతా విరుపాపురగడ్డ సమీపాన ఉన్న మైదానంలో టెంట్‌ వేసుకొని బస చేస్తున్నారు. అయితే పోలీసులు వారిని ఖాళీ చేయించారు. దీంతో హోసపేటె నగరానికి చేరుకొన్న ఈ దేశీయుల బృందం గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్టాండు ముందు విన్యాసాలు ప్రదర్శిస్తు భిక్షాటన చేశారు. జనం తోచిన డబ్బును అందించారు. ఈ డబ్బును పేదలకు ఇస్తామని కొందరు, సొంతానికి వాడుకుంటామని మరికొందరు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో మనదేశ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులు చిల్లరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజస్థాన్ లో పుష్కర్ ప్రాంతంలో నవంబర్ లో విదేశీ పర్యాటకులు తమకు వచ్చిన విద్యలు ప్రదర్శించి చిల్లర అర్థించారు.

మరిన్ని వార్తలు