బ్యాంకుకు వెళితే చిల్లర చేతిలో పెట్టారు!

3 Dec, 2016 09:50 IST|Sakshi
బ్యాంకుకు వెళితే చిల్లర చేతిలో పెట్టారు!

జలంధర్‌: ప్రజలకు కరెన్సీ తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 10 వేల రూపాయలు చొప్పున నగదు పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా చాలా బ్యాంకుల్లో కేవలం 2 వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు. పంజాబ్‌లోని జలంధర్‌లో పెన్షనర్లకు వింత అనుభవం ఎదురైంది.

బ్యాంకుల్లో పెన్షనర్లకు 10 వేల రూపాయల నగదు అయితే ఇచ్చారు కానీ 9 వేల రూపాయలకు మాత్రమే నోట‍్లను అందజేశారు. మిగిలిన 1000 రూపాయలకు రెండు రూపాయల నాణేలు ఇచ్చారు. ఓ కవర్‌లో ఉంచిన చిల్లరను బ్యాంకర్లు పెన్షనర్ల చేతిలో పెట్టారు. దీంతో వారు అవాక్కయ్యారు. ఈ రెండు రూపాయల నాణేలతో ఏం చేయాలి? ఎలా ఉపయోగపడుతుంది? అంటూ ఓ పెన్షనర్‌ ప్రశ్నించారు. ఈ రోజుల్లో పిల్లలు కూడా 2 రూపాయల నాణేలను తీసుకోవడం లేదు.. ఇవి ఎలా ఉపయోగపడతాయి? ప్రభుత్వం మమ్మల్ని ఆ స్థాయికి దిగజార్చిందంటూ వాపోయారు. దీనిపై బ్యాంకు అధికారులు వివరణ ఇస్తూ.. నగదు సమస్య అని కొందరు చెప్పగా, కంప్యూటర్ల సమస్య అని మరికొందరు అన్నారు.

>
మరిన్ని వార్తలు