నోట్లు అగచాట్లు

15 Nov, 2016 09:06 IST|Sakshi
నోట్లు అగచాట్లు

వారం రోజులైనా అదే పరిస్థితి.. బ్యాంకుల ముందు బారులు తీరిన జనం
రెండు మూడు గంటల్లోనే నగదు నిల్వలు ఖాళీ
ఏటీఎంలను నింపలేక చేతులెత్తేస్తున్న బ్యాంకులు
లావాదేవీల పరిమితి పెంపుతో మరింత ఒత్తిడి
చిన్న బ్యాంకుల పరిస్థితి మరింత దారుణం
అందుబాటులోకి రాని కొత్త రూ. 500 నోట్లు
రూ. 2,000 నోటుకు చిల్లర దొరకని వైనం
చిరు వ్యాపారులకు కోలుకోలేని ‘పెద్ద’ దెబ్బ
రోజంతా పడిగాపులు కాసినా కూలి డబ్బులూ దక్కని దుస్థితి
వంద నోట్లు, చిల్లర ఇచ్చే నాథుడు లేడు
రాష్ట్రంలో వేలాది చిరు వ్యాపారుల కుటుంబాల ఇక్కట్లు

సాక్షి, అమరావతి
పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో సామాన్యప్రజలు ఎదుర్కొంటున్న తిప్పలు రోజురోజుకూ పెరుగుతున్నాయేగానీ తగ్గడం లేదు. వారంరోజులైనా పరిస్థితి ఏ మాత్రం చక్కబడటంలేదు. అన్ని ప్రాంతాల్లో కరెన్సీ అత్యవసర స్థితి ఏర్పడింది. ప్రజలకు రోజులకొద్దీ సమయం బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల వద్దే గడిచిపోతోంది. చిన్నా, పెద్దా, మహిళలు, వృద్ధులు తేడా లేకుండా అందరూ క్యూలైన్లలోనే తమ ఓపికను, చెమటను ధారబోస్తున్నారు. గంటలపాటు క్యూల్లో నిల్చున్నా చివరికి అక్కడ తగినంత నగదు లేకపోవడంతో ఉసూరుమంటూ వెనక్కివెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నారుు.

మరోవైపు తెలుగు రాష్ట్రాలకు ఇంతవరకూ ఒక కొత్త రూ. 500 నోటు కూడా రాలేదు. బ్యాంకుల్లో చాలావరకు రూ. 2వేల నోట్లు ఇస్తుండడంతో రోజువారీ అవసరాలకు వాటిని మార్చడం అసాధ్యంగా మారింది. కొన్నిచోట్ల రూ. 100 నోట్లు ఇస్తున్నా ఉన్న డిమాండ్‌తో పోల్చుకుంటే అది చాలా స్వల్పం. నగదు కొరతతో అన్ని వర్గాల ప్రజలు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడున్న డిమాండ్‌కే నగదు సరఫరా చేయలేక బ్యాంకులు ఇబ్బంది పడుతుంటే మరోవైపు లావాదేవీలపై పరిమితులను పెంచడంతో బ్యాంకుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

ఇప్పుడు బ్యాంకు నుంచి వారంలో రూ. 24,000 వరకు తీసుకోవచ్చనడం పెద్ద ఇబ్బందిగా మారిందని బ్యాంకు అధికారి వాపోయారు. అలాగే ఏటీఎంల నుంచి విత్‌డ్రాయల్ పరిమితిని రూ. 2,500కు పెంచినా చాలా చోట్ల అమలు కాలేదని ఫిర్యాదులు వచ్చారుు. ఒకసారి బ్యాంకు నుంచి వెళ్లిన 100 నోట్లు తిరిగి బ్యాంకుల వద్దకు రావడం లేదని, దీంతో నగదు సరఫరా చేయలేకపోతున్నామని అధికారులు అంటున్నారు.

 చిన్న బ్యాంకులపై ఆర్‌బీఐ వివక్ష
నగదు సరఫరాలో ఆర్‌బీఐ వివక్ష చూపిస్తోందని చిన్న బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంకు అధికారులు వాపోతున్నారు. ఉన్న నగదులో అత్యధిక భాగం ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బీవోబీ వంటి పెద్ద బ్యాంకులకు కేటారుుంచి, ఆంధ్రాబ్యాంక్, సహకార బ్యాంకులకు చిల్లర విదిలిస్తుండటంతో ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోవడం కష్టంగా ఉందని పేరు రాయడానికి ఇష్టపడని బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రాష్ట్రాల్లో ఉన్న సహకార బ్యాంకు ఖాతాదారుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఎవరి దగ్గరో నల్లధనం ఉందని మాలాంటి సామాన్యులను ఇబ్బందికి గురి చేయడం ఎంతవరకు సమంజసమని వీరు ప్రశ్నిస్తున్నారు.

కొత్త రూ. 500 నోట్ల కోసం ఎదురుచూపులే..!
సోమవారం నుంచి బ్యాంకుల ద్వారా కొత్త రూ. 500 నోట్లు చెలామణిలోకి వస్తాయనే వార్తలతో అందరూ వాటి కోసం ఎదురు చూశారు. కానీ ఇంతవరకూ ఆర్‌బీఐ వాటిని రెండు రాష్ట్రాలకు పంపలేదు. తమకు ఎప్పుడు ఈ నోట్లు పంపుతారని అధికారులు ఆర్‌బీఐని సంప్రదించగా సరైన సమాధానం రాలేదు. ఇక్కడి ఆర్‌బీఐ రీజనల్ అధికారులకు సైతం దీనిపై స్పష్టత లేదు. మరో రెండుమూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రూ. 500 నోట్లు వస్తే కొంతవరకూ ప్రజల ఇబ్బందులు తీరే అవకాశం ఉంటుంది. నోట్ల రద్దు నేపథ్యంలో ఏపీకి రూ. 6,500 కోట్లను ఆర్‌బీఐ పంపింది. అందులో రూ. 4,500 కోట్లకుపైగా సొమ్ములో రెండు వేల నోట్లే ఉండడం గమనార్హం. మరోవైపు కొత్త రూ. 500 నోట్లరుునా ఏటీఎంలతో సరిపోతాయో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. సైజులు తేడా కారణంగా ఇప్పటికే రెండు వేల నోట్లు ఏటీఎంలలో అమరని విషయం తెలిసిందే.

చిరువ్యాపారాలు చిందరవందర
పెద్ద నోట్ల రద్దుతో చిరు వ్యాపారాలు చిందర వందర అయ్యారుు. పూలు, పండ్లు, కూరగాయల కొనుగోలు మార్కెట్ తీవ్రంగా దెబ్బతింది. రాజధాని అమరావతి ప్రాంతంలోనే దాదాపు 11,500 పైగా చిరు వ్యాపారాలు, తోపుడు బళ్లు(స్ట్రీట్ వెండర్స్) వారంగా అమ్మకాలు లేక దయనీయ పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తోపుడు బండ్లు, రైతు బజార్లు, పాల కేంద్రాలు, కిళ్లీ బడ్డీలు తదితర చిరు వ్యాపారాలకు ఇప్పుడు అమ్మకాలు పడిపోరుు వెలవెలబోతున్నారుు. రోజంతా రోడ్డు పక్కన బళ్లు పెట్టి, దుకాణాలు తీసి పడిగాపులు పడినా ఇప్పుడు వారికి కూలి డబ్బులు కూడా గిట్టక చిరువ్యాపారుల కుటుంబాలు పస్తులు ఉండాల్సి వస్తోంది. రద్దు చేసిన పాత నోట్లు చిరు వ్యాపారులు తీసుకోలేరు. అలా అని రూ.2 వేల కొత్త నోటుకు చిల్లర ఇవ్వలేక బేరాలు వదులుకుంటున్నారు. మార్కెట్‌లో వంద నోట్ల తీవ్ర కొరత చిరు వ్యాపారాన్ని దారుణంగా దెబ్బతీస్తోందని వాపోతున్నారు.

మళ్లీ ’కాల్’నాగుల కోరల్లో పడాల్సిందేనా?
రాష్ట్రంలోని పట్టణాలు, మండల కేంద్రాల్లో తోపుడు బళ్ల వ్యాపారులు చాలా వరకు రోజువారీ వడ్డీలకు తెచ్చుకుని బతుకు బండిని నడుపుతుంటారు. రోజువారీ వడ్డీ వ్యాపారి ఉదయం రూ. 850, రూ. 800 ఇచ్చి రాత్రి అమ్మకాలు అయ్యాక వచ్చి రూ. 1,000 వసూలు చేసుకుని వెళ్తాడు. ఇచ్చిన మొత్తం వడ్డీతో సహా చెల్లించకుంటే ఉపాధి చూపే తోపుడు బండి, ఇతర విలువైన వస్తువులను నిర్దయగా పట్టుకుని పోరుు బెదిరిస్తాడు. ఇటీవల ఈ తరహా కాల్ నాగుల బారిన పడుతున్న చిరు వ్యాపారులు గత్యంతరం లేక మూగ వేదన భరిస్తూనే బతుకు బండిని నెట్టుకొచ్చేందుకు రోజువారీ వడ్డీలు చెల్లిస్తున్నారు. నోట్లు రద్దు కారణంగా ఇప్పుడు పెట్టుబడిగా తీసుకున్న మొత్తాలు చెల్లించలేకపోతున్న చిరు వ్యాపారులు కుటుంబ పోషణ కోసం కూడా మళ్లీ కాల్‌నాగుల కోరల్లో చిక్కుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.

 నిర్మాణ కూలీలకు పెద్దనోట్లే..
పనులు అనుకున్న సమయానికి పూర్తి కావడం కోసం కాంట్రాక్టర్లు పలు చోట్ల కూలీలపై ఒత్తిడి తెచ్చి.. కూలీ సొమ్ముగా పాత పెద్ద నోట్లు ఇస్తున్నారు. ఇలా ఒక రోజు కూలీ చేసి పెద్ద నోట్లు తీసుకుంటే వాటిని మార్చుకోవడానికి మరో రోజంతా బ్యాంకు దగ్గర పడిగాపులు పడాల్సివస్తోందని కూలీలు ఆవేదన చెందుతున్నారు. దాంతో పనులకు వెళ్లడమే మానుకుంటున్నారు.

 ఇంతకంటే ఆధారంలేదు..
ఈ వయస్సులో ఇంతకంటే పనిచేయలేను. ఏదో చిరు వ్యాపారం పెట్టుకుని రోజంతా అమ్మితే ఇంట్లో గడుస్తుందనే ఆశ. కానీ చిల్లర ఇబ్బందులు వల్ల అమ్మకాలు లేవు. మాలాంటి వారి పరిస్థితిని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. -నారాయణమ్మ, కూరగాయల వ్యాపారి

 రూ. 500 నోటు తెస్తున్నారు..
చాలా మంది వినియోగదారులు తమకు కావాల్సిన పండ్లు కొనుక్కుని చేతిలో రూ. 500 నోటు పెడుతున్నారు. ఇవి మారవు కదా అంటే డిసెంబర్ 30 వరకు మార్చుకోవచ్చని అంటున్నారు. వాటిని తీసుకుని మార్చుకునే పరిస్థితి మాకు లేక వ్యాపారం నష్టపోవాల్సి వస్తోంది. - వెంకటేశ్వరరావు, వ్యాపారి

 రోజంతా అమ్మినా కూలి గిట్టలేదు..
కూలి పనికి వెళితే ఎంతో కొంత డబ్బులు చేతిలో పడతాయనే నమ్మకం ఉంది. కానీ పెద్ద నోట్ల రద్దుతో మా వ్యాపారం తారుమారు అరుు్యంది. రోజంతా అమ్మినా కూలి డబ్బులకు సంపాదించడమే కష్టమవుతోంది. -శాంతి, పండ్ల వ్యాపారి

 వ్యాపారం  లేదు.. అప్పు పుట్టదు..
గతంలో రోజుకు రూ. 1,500 వస్తువులు అమ్మేవాడిని. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుతో రూ.100 కూడా అమ్మడం లేదు. తోపుడు బండితో రోజంతా కాళ్లరిగేలా తిరిగినా కుటుంబాన్ని పోషించుకునేలా ఆదాయం పొందలేకపోతున్నా. -కృష్ణమూర్తి, తోపుడు బండిపై వ్యాపారం

 చిల్లరతో ‘పెద్ద’వ్యాపారం
కేంద్రం ప్రకటించిన మేరకు ఈ నెల 24వ తేదీ వరకూ పెట్రోల్ బంకుల్లో పాత పెద్ద నోట్లు చెల్లుబాటు అవుతారుు. కానీ పెట్రోల్ బంకుల సిబ్బంది వినియోగదారులకు దారుణమైన టోపీ పెడుతున్నారు. పాత రూ.500, రూ.1,000 నోట్లు తీసుకోవడం లేదు, తీసుకున్నా తగిన చిల్లర ఇవ్వడం లేదు. రూ.500 నోటు ఇచ్చి 100 రూపాయల పెట్రోల్ పోరుుంచుకుంటే మిగతా రూ.400 ఇవ్వకుండా... యాభై, వందా కమీషన్ తీసుకుని రూ.300, రూ.350 ఇస్తున్నారు. అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లోనూ.. కొన్ని చిన్న హోటళ్లు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు, దుకాణాలతోపాటు కొందరు వ్యాపారులు ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వార్తలు