అమరావతి భూములపై ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

10 Aug, 2017 02:02 IST|Sakshi
అమరావతి భూములపై ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూముల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు, సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు, జర్నలిస్టులు తదితర విశేష వ్యక్తులకు ప్రభు త్వం ఇళ్ల స్థలాలు కేటాయించడంపై అభ్యంత రం వ్యక్తం చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో మాజీ ఎమ్మెల్యే అడుసుమల్లి జయప్రకాష్, రిటైర్డ్‌ లెక్చరర్‌ లక్ష్మణ రెడ్డి వల్లం రెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

 పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవా దులు సత్యప్రసాద్, మహేష్‌ బాబు పిటిషన్‌ లోని అంశాలను వివరిం చారు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి విధానం లేకుండా వందలాది ఎకరాలను వివిధ సంస్థలకు ధారాదత్తం చేస్తోందని  పేర్కొన్నారు. అమృత వర్సిటీకి 200 ఎకరాలు, బీఆర్‌ఎస్‌ మెడిసిటీ హెల్త్‌కేర్‌ సంస్థకు 100 ఎకరాలు, ఇండో ృ యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సంస్థకు 150 ఎకరాలు.. ఇలా అనేక సంస్థలకు వందలాది ఎకరాలు కట్టబెట్టిందని ఆ జీవోలను  జత పరిచారు.

ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ కుటుంబ సభ్యులు, పల్లె రఘునాథరెడ్డి కుమారుడు పల్లె వెంకట కృష్ణ కిశోర్‌ రెడ్డి, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సంబంధీకులు, మంత్రి నారాయణ సంబంధీకులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీఎస్‌ ఆంజనేయులు కూతురు లక్ష్మీసౌజన్య తదితరులకు ఈ కేటాయింపులు జరిగాయని విన్నవించారు.  విశాఖపట్నంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయా యని దీనిని సొమ్ము చేసుకునేందుకు అధికా రం, పలుకుబడి ఉన్న నేతలు రెవెన్యూ అధికా రులతో కుమ్మక్కయి ప్రభుత్వ భూములను మాయం చేశారన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.