పెట్రోల్, డీజిల్ ధరల పెంపు

5 Nov, 2016 19:48 IST|Sakshi
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు

హైదరాబాద్: దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఒక లీటరు పెట్రోల్ పై 89 పైసలు, ఒక లీటరు డీజిల్ పై 86 పైసల ధర పెరిగింది. ఈ మేరకు పెరిగిన ధరలు శనివారం అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తాయని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. వాస్తవానికి ఐదు రోజుల ముందే వెలువడాల్సిన పెంపు నిర్ణయం డీలర్ల సమ్మె కారణంగా వాయిదాపడింది. కమీషన్ పెంపు వ్యవహరంపై ఆయిల్ కంపెనీలకు, పెట్రోల్ బంక్ డీలర్లకు మధ్య నెలకొన్న వివాదం శుక్రవారం ముగియడంతో మరుసటిరోజే వాహనదారులకు వాతపడింది.

తాజా పెంపుతో హైదరాబాద్ లో లీటరుకు రూ. 70.96గా ఉన్న పెట్రోల్ ధర.. 71.85 పైసలకు చేరింది. రూ.60.39గా ఉన్న లీటరు డీజిల్ రూ.62.25కు చేరింది. (ఆయిల్ కంపెనీని బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి). ప్రతి 15 రోజులకు ఒకసారి ఆయుల్ ధరలను సమీక్షించే కంపెనీలు..  చివరిసారిగా.. అక్టోబర్ 15న కూడా ధరలు (పెట్రోల్ పై రూ.1.34, డీజిల్ పై రూ.2.37) పెంచిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు