పెట్రోల్‌ ధర రూ.3 పెంపు..ఎక్కడ?

24 Apr, 2017 08:41 IST|Sakshi
పెట్రోల్‌ ధర రూ.3 పెంపు..ఎక్కడ?

ముంబై:  ముంబై  వాహనదారులకు మహారాష్ట్ర  ప్రభుత్వం  భారీ షాక్‌ ఇచ్చింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి పెట్రోల్‌ ధరలను పెంచేసింది.  ఇంధనంపై అదనపు పన్నును(వ్యాట్‌) పెంచిన నేపథ్యంలో  రిటైల్ మార్కెట్లలో పెట్రోలు ధర లీటరుకు 3రూపాయలు పెంచింది.  అయితే డీలర్‌ ధరను మాత్రం యథాతథంగా ఉంచింది.   

ఫలితంగా ముంబై, థానే  పెట్రోలు వినియోగదారులకు రూ. ప్రస్తుత పన్ను రేటు 26శాతం ప్లస్‌ 9 రూపాయల భారం పడుతోంది. కాగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఇది 25 శాతం ప్లస్‌ రూ. 9 రూపాయలుకు పెరిగింది.

అయితే డీజిల్‌ ను వ్యాట్‌ నుంచి మినహాయించింది. దీంతో మెట్రోపాలిటన్‌ రీజన్‌, ఇతర  ప్రాంతాలలో  డీజిల్‌  ధరలే యథాతథంగా ఉండనున్నాయి. కాగా ఇటీవల లీటర్‌  పెట్రోల్‌ ధరలను రూ. 3.77లు తగ్గించింది. అలాగే డీజిల్‌  ధరను రూ. 2.91లు తగ్గించింది. గత మూడు నెలలకాలంలో పెట్రోల్‌ ధరలను పెంచడం ఇదే మొదటి సారి.  

 

మరిన్ని వార్తలు