పీఎఫ్ ట్రాన్స్ఫర్ కోసం కొత్త నిబంధన

15 Oct, 2016 13:16 IST|Sakshi
పీఎఫ్ ట్రాన్స్ఫర్ కోసం కొత్త నిబంధన

ముంబై : రిటైర్మెంట్ నిధి సంస్థ ఇపీఎఫ్ఓ  పీఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాన్ని సులభతరం చేసింది. ఈ మేరకు నిబంధనలను  మరింత  సడలించింది.  ఫారం నెం. 11 పేరుతో కొత్త డిక్లరేషన్ ఫాంను ప్రవేశపెట్టింది.  ప్రస్తుతం ఉన్న ఫారం నెం 13 స్థానంలో దీన్ని రీప్లేస్ చేసింది. కొత్త ఫారం నెం.11లో  నో యువర్ కస్టమర్ (కేవైసీ) లో లాగానే వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.  యూఏఎన్  నెంబర్  ఆధారంగా ద్వారా అతని / ఆమె పాత యజమాని లేదా, కంపెనీ నుంచి  పీఎఫ్  బదిలీ కోసం అభ్యర్థన చేసుకోవచ్చని ఈపీఎఫ్వో ​ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) లోని సభ్యులు ఉద్యోగం మారినపుడు  తమ పీఎఫ్ డిపాజిట్లను బదిలీ  చేసుకోవాలనుకునే వారికోసం ఈ నిబంధనలను సడలించినట్టు తెలిపింది.  మరోవైపు రెండు లక్షల సాధారణ సేవా కేంద్రాల (సీఎస్సీ) ద్వారా  పీఎఫ్ సెటిల్ మెంట్ కోసం  వివిధ ఆన్లైన్ సౌకర్యాలను విస్తరించనున్నట్టు వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా  చందాదారులకు సుమారు7.84 కోట్ల యూఏఎన్ నెంబర్ల జారీకోసం ఐటి శాఖ ఈపీఎఫ్వోకు సహాయం చేయనుందనీ, త్వరలోనే ఈ ప్రక్రియ  పూర్తికానుందని  వివరించింది   అలాగే ఇప్పటికే యూఏఎన్  కేటాయించిన,  కేవైసీ డిజిటల్ వెరిఫికేషన్ పూర్తి చేసిన  ఖాతాదారులు,  ఈ కొత్త  ఫారంను నింపాల్సిన అవసరం లేదని  స్పష్టం చేసింది.  
కాగా  ఇపిఎఫ్ఓ వెబ్ సైట్ లో అందుబాటులో  ఉన్న డేటా ప్రకారం 2.93 కోట్ల  యూఏఎన్ నెంబర్లు యాక్టివేట్ అయ్యాయి దేశంలో ప‌నిచేసే ఉద్యోగులంద‌రికీ యూఏఎన్(యూనివ‌ర్సల్ అకౌంట్ నంబ‌రు లేదా సార్వత్రిక ఖాతా సంఖ్య‌) చాలా కీలకం. ఎందుకంటే ఉద్యోగం మారిన‌ప్పుడు పీఎఫ్ డ‌బ్బు బ‌దిలీకి  (ట్రాన్స్‌ఫ‌ర్‌) యూఏఎన్ ఉపయోగపడుతోంది.   అలాగే యూఏఎన్ నెంబరు తో ఆధార్ నెం. ను  అనుసంధానం చేయడం ద్వారా  మరింత  సరళతరం చేసిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు