ఫోటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం

23 Aug, 2013 09:14 IST|Sakshi

దేశ రాజధానిలో  సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయ ఘటన దేశ ప్రజల మనోఫలకంపై నుంచి ఇంకా చెరిగిపోక మునిపే దేశ వాణిజ్య రాజధాని మంబైలో మరో మహిళపై సామూహిక అత్యాచార సంఘటన దేశ ప్రజలను తీవ్రంగా కలచివేసింది. ముంబైలోని మహాలక్ష్మీ ప్రాంతంలోని శక్తి మిల్స్ ప్రాంగణంలో ఓ మహిళా (23) ఫోటో జర్నలిస్ట్ పై దుండగులు గురువారం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఓ ఇంగ్లీష్ పత్రికలో ఫోటో జర్నలిస్టుగా పని చేస్తున్న ఆమె విధి నిర్వహణలో భాగంగా తన అసిస్టెంట్తో కలసి గురువారం సాయంత్రం శక్తి మీల్స్ ప్రాంగణంలోకి చేరుకున్నారు. కాగా ఆ మీల్ ప్రాంగణమంతా చాలావరకూ మాదకద్రవ్యాలకు బానిసలైనవారితో కిక్కిరిసి ఉంటుంది. ఆమె ఆ ప్రాంగణంలో ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాన్ని కొంత మంది యువకులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో ఆమె సహాయకునిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

అనంతరం మహిళ ఫోటోగ్రాఫర్పై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె తన అసిస్టెంట్ సహాయంతో జస్లోక్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి  వైద్యులు వెంటనే ఈ ఘటనపై ఎన్ఎం జోషి మార్గ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని సంఘటన వివరాలను తెలసుకుని, 20 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహారాష్ట హోం మంత్రి ఆర్ ఆర్ పాటిల్ మహిళపై అత్యాచర ఘటన విషయం తెలిసిన వెంటనే జస్లోక్ ఆసుపత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిణిస్తుందని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆర్ ఆర్ పాటిల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు