8 నెలల క్రితం గ్యాంగ్రేప్... ఇప్పుడు వెలుగులోకి...

3 Jun, 2014 14:06 IST|Sakshi
8 నెలల క్రితం గ్యాంగ్రేప్... ఇప్పుడు వెలుగులోకి...

వికలాంగురాలైన మహిళ (25)పై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. అయితే విషయం దాదాపు ఎనిమిది నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. అది సదరు మహిళ గర్భవతి కావడంతో అసలు విషయం బయటపడింది. దాంతో వికలాంగురాలిని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. దాంతో ఆ యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఆ సంఘటన ఉత్తరప్రదేశ్ షామిల్ జిల్లా కైరానా పట్టణంలో చోటు చేసుకుంది. నిందితులు మహబూబ్, మొబిన్, మున్నావర్, నూర్ మహ్మద్లుగా గుర్తించినట్లు... వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

 

ఇంట్లో ఎవరు లేని సమయంలో వికలాంగురాలిపై పైన పేర్కొన్న సదరు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ విషయాన్ని బయటకు వెల్లడిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. దాంతో ఆమె మిన్నుకుండిపోయింది. ఆ క్రమంలో ఇటీవల ఆ వికలాంగురాలైన మహిళ తీవ్ర అనారోగ్యం పాలైంది. దాంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆమె గర్బవతి అని వైద్యులు తల్లిదండ్రులకు వెల్లడించారు. దాంతో వారు వికలాంగురాలిని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 

>
మరిన్ని వార్తలు